Warangal
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ రాజశ్రీ
తానూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ సీడీపీఓ రాజశ్రీ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సమతుల్యమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై…
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి) చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సవిత విద్యార్థినులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఎం.జె.పి. బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, ఇతర సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్న తీరును స్వయంగా వీక్షించారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన మంత్రి.. వారి…
డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇంధన పొదుపుపై డ్రైవర్లకు కీలక సూచనలు డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్, మద్యం పూర్తిగా నిషేధం నిజామాబాద్, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం రీజియన్…
డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్
జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి అమలు ఇంటి వద్దకే 41 రకాల ఉచిత వైద్య పరీక్షలు.. 48 గంటల్లో రిపోర్టులు ధర్మవరం, సెప్టెంబరు 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, వైద్య పరీక్షల నుంచి చికిత్స వరకు అవసరమైన వైద్య సేవలను అనుసంధానం చేసే ‘సంజీవని’ కార్యక్రమాన్ని డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించి, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ…
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
మంత్రి సవితమ్మకు వినతిపత్రం కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా…
లక్ష్మీ గణపతి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం
రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రతిష్ఠాపించబడిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బద్దం…
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
బట్టాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ఎర్గట్ల, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా పాలనలో భాగంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను…
అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నారెడ్డికి పరామర్శ
పరిగి, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న చెన్నారెడ్డిని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పరామర్శించారు.ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉషశ్రీ చరణ్,…
ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన శ్రీధర్ గౌడ్‌కు ఘన సన్మానం
గౌడ సంఘం అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ విజయం వెనుక కృషికి అభినందనలు రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల గౌడ సంఘం ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీధర్ గౌడ్ను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మీసాల గోవింద్ గౌడ్ విజయం సాధించడంలో శ్రీధర్ గౌడ్ చేసిన కృషిని సంఘం సభ్యులు అభినందించారు. రుద్రూర్ మండల గౌడ సంఘంలో మొత్తం 86 మంది ఓటర్లు ఉండగా, 83…
ఘనంగా లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలు
కంటి ఆసుపత్రి రోగులకు అన్నదానం రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్ లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.ఈ సందర్భంగా లయన్ పత్తి రాము మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం…
