E6TV Special Storys
it is exclusive Content for E6TV
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యం
PM RAHAT, PM RAH-VEER పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సకాలంలో వైద్యసేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం PM RAHAT మరియు PM RAH-VEER పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
వసతులు మేము కల్పిస్తాం.. మెరుగైన వైద్యం మీరందించండి : ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జీజీహెచ్ అభివృద్ధి సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. కలెక్టర్ ఇలా…
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి : ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు…
బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒడ్డెట్‌పల్లి, అమ్రాద్, బోర్గం, మాణిక్‌బండారు, గొట్టుముక్కల, మంతాపూర్ గ్రామాల్లో మరణించిన బీజేపీ…
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్…
గృహనిర్బంధంతో గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్గల్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆర్మూర్/భీమ్గల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే…
బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు: మానాల మోహన్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి…
జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం!
ప్రస్తుతం పొడి వాతావరణం.. 15 నుంచి పరిస్థితుల్లో మార్పు జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం! జూలై 15: E6 న్యూస్ స్పెషల్ ఆర్టికల్: శివ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణం, తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు త్వరలో కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
నందిపేట్‌లో జర్నలిజం ముసుగులో పర్సంటేజీల దందా..?
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఏజెన్సీల నుంచి శాతం % వసూళ్ల ఆరోపణలు నందిపేట్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ నందిపేట్ మండలంలో ఓ ప్రముఖ పత్రికలో సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేఖరిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంలో ఉన్న ప్రజల వద్ద నుండి పర్సంటేజీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. స్వతహాగా నందిపేట్ నివాసి అయిన విలేకరి నందిపేట్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ నగరానికి, నగరం నుండి నందిపేట్ మండల కేంద్రానికి ప్రతిరోజూ…

