Breaking News

చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.

అక్బర్‌నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి).

చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని పేర్కొన్నారు. ఆపద సమయంలో తనను ఆదుకుని మరో జన్మ ఇచ్చినట్టుగా భావిస్తున్నానని, ఆయనకు జన్మజన్మలూ రుణపడి ఉంటానని తెలిపారు.

గ్రామ పెద్దల కృషి మరువలేనిది

తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న అక్బర్‌నగర్ గ్రామ పెద్దలు తన కోసం నిలబడ్డారని అశోక్ తెలిపారు. గ్రామ పెద్దలంతా కలిసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించారని, తనకు న్యాయం చేయాలని కోరారని చెప్పారు.గ్రామ పెద్దలు చూపిన చొరవ, తన కోసం చేసిన ప్రయత్నాలు, కష్టకాలంలో అందించిన సహకారం జీవితాంతం గుర్తుండిపోతాయని అశోక్ అన్నారు.మారుతి గౌడ్, హబీబ్ ఖాన్, చిల్లపల్లి సాయిలు, బందెల సంజీవ్, రాజా వరప్రసాద్, రామా గౌడ్, అన్వర్, నడిపింటి నగేష్, దూడ రమేష్, ఫెరోజ్ ఖాన్, కాంతారావు తదితర గ్రామ పెద్దలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రాజా వరప్రసాద్, చిరుత దత్తు, పోసి రామ్, చిల్లపల్లి సాయిలు, నగేష్, కాంతారావు, పోశెట్టి తదితరులు తన కోసం చేసిన కృషిని ఎప్పటికీ మరువనని అన్నారు.

జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

తాను జైలులో ఉన్న సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ అశోక్ ధన్యవాదాలు తెలిపారు. తన కోసం దేవుళ్లను మొక్కుకుని, ప్రార్థనలు చేసి, తాను క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.

కష్టకాలంలో E6tv NEWS యాజమాన్యం అండ

తాను జైలుకు వెళ్లిన సమయంలో E6tv NEWS యాజమాన్యం, నిజామాబాద్ బ్యూరోతో పాటు రాష్ట్ర స్థాయి యాజమాన్యం తనకు అండగా నిలిచిందని అశోక్ తెలిపారు..

తనకు జరిగిన పరిణామాలపై స్పందించి, సంబంధిత మంత్రుల పీఏలు, మంత్రులు, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి తనకు న్యాయం జరగాలని ప్రయత్నించిన E6tv NEWS యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కష్టకాలంలో తన వెంటే నిలిచిన E6tv NEWS యాజమాన్యం చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని అశోక్ అన్నారు.

“చేయని తప్పుకు పోలీసుల వేధింపులకు గురైన సమయంలో ఆపదలో నన్ను కాపాడిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి సారు, నా కష్టకాలంలో వెన్నంటే నిలిచిన E6tv NEWS యాజమాన్యం, గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. నా కోసం నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అశోక్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *