మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి).
మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది స్వామి, వార్డు సభ్యుడు సక్కర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


