Breaking News

మాజీ మంత్రి రేఖానాయక్ రైస్ మిల్ పై నమోదైన కేసు

నిర్మల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు చెందిన రైస్ మిల్లు నుంచి ₹40.96 కోట్ల విలువైన ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్లు గుర్తించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) నిర్మల్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

కేసు వివరాలు & ముఖ్యాంశాలు:

మిల్లు వివరాలు: ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్’ (ARS Industries) పేరుతో ఉన్న రైస్ మిల్లుపై కేసు నమోదైంది.

చట్టపరమైన చర్యలు:  భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(2), 316(5), 318(4) లతో పాటు నిత్యావసర వస్తువుల చట్టం 1955 (Section 7) కింద కేసులు నమోదు చేశారు.

తనిఖీల్లో వెలుగు చూసిన వ్యత్యాసం: మిల్లు ఆవరణలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన భౌతిక తనిఖీల్లో (Physical Verification) ప్రభుత్వం అప్పగించిన ధాన్యం నిల్వలు లేవని, అలాగే ప్రభుత్వం అందించాల్సిన ‘కస్టమ్ మిల్డ్ రైస్’ (CMR) గడచిన మూడు సీజన్లుగా ఇవ్వలేదని అధికారులు తేల్చారు.

పక్కదారి పట్టిన నిల్వలు:

యాసంగి (Rabi) 2022–23, 2023–24 మరియు 2024–25 సీజన్లకు గాను ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది.

అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది.

ఈ మాయమైన ధాన్యం యొక్క మొత్తం విలువ ₹40,96,96,847 అని పౌర సరఫరాల శాఖ నిర్ధారించింది.

ప్రభుత్వ సొత్తును దుర్వినియోగం చేసి నిధుల మళ్లింపునకు పాల్పడినందున చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *