గృహప్రవేశ వేడుకలో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు.. అరుణ్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్
తాడ్కోల్, నవంబర్ 14: (E6tv NEWS).
బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎనుగు రవీందర్ రెడ్డి తాడ్కోల్ గ్రామంలో ఆత్మీయంగా పర్యటించి గ్రామస్తులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పలు శుభకార్యాలు, వ్యక్తిగత వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.తాడ్కోల్ గ్రామానికి చెందిన పట్లోళ్ల కవిత–రవీందర్ రెడ్డి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకకు ఎనుగు రవీందర్ రెడ్డి హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామానికి చెందిన బొప్పిడ్డె వెంకన్న (విక్రమ్ రెడ్డి) నివాసానికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోతులగొడ యెల్లారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
అరుణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎనుగు రవీందర్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అరుణ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అరుణ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకకు విలువైన సమయాన్ని కేటాయించి స్వయంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎనుగు రవీందర్ రెడ్డి అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వాములవుతూ, శుభకార్యాలు, వ్యక్తిగత వేడుకల్లో పాల్గొంటూ ప్రజలతో ఆత్మీయ సంబంధాలను కొనసాగించడం నాయకత్వానికి నిదర్శనమని గ్రామస్తులు పేర్కొన్నారు.
