లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి.. డ్రైవర్‌పై కేసు నమోదు
ఎల్లారెడ్డి, నవంబర్ 14 (E6tv NEWS):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మాచాపూర్ గ్రామానికి చెందిన మాచబోయిన పరమేశ్వర్ (35) శుక్రవారం సాయంత్రం సుమారు 7:15 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మల్లయ్యపల్లి గేట్ సమీపంలో లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో పరమేశ్వర్ తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై మృతుడి భార్య మాచబోయిన అనుసవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మాచాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

