జగిత్యాల, నవంబర్ 16:(E6tv NEWS).
జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. మల్యాల ఎక్స్‌రోడ్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మద్దుట్ల గ్రామానికి చెందిన చుంచుల మల్లయ్య రోడ్డు దాటుతుండగా జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన కారు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య మృతిచెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి మృతితో మద్దుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
