Breaking News

ఎల్బీనగర్ – హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్ ఖరారు!

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కలిసిన సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. ఈ భేటీలో ఎల్బీనగర్ – హయత్‌నగర్ కారిడార్‌తో పాటు ఎన్హెచ్-167కేపై కృష్ణానది మీద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే హైదరాబాద్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, పర్వతమాల పథకం కింద 5 రోప్‌వేలు, సేతు బంధన్ పథకం కింద 3 ఆర్ఓబీలను కేంద్రం మంజూరు చేసింది. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. సీఆర్ఐఎఫ్ నిధుల ద్వారా రాష్ట్రంలో 34 పనులకు ఆమోదం తెలపాలని, పుల్లూర్-అలంపూర్-కొల్లాపూర్-దేవరకొండ-నల్గొండ మార్గాన్ని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొని, నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) సదస్సుకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *