National
గడ్కోల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏం జరుగుతోంది?
రైతులకు క్రాప్ లోన్లలో ఇబ్బందులు.. రుణం కోసం పలుమార్లు తిరుగుతున్న ఖాతాదారులు బంగారు రుణం చెల్లించినా నగలు తిరిగి ఇవ్వడం లేదన్న ఆరోపణలు బ్యాంకు సిబ్బంది తీరుపై ఖాతాదారుల ఆవేదన.. ఉన్నతాధికారులు స్పందించాలంటున్న గ్రామస్తులు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).బ్యాంకులు సామాన్య ప్రజలకు ఆర్థిక సేవలు అందించాల్సిన సంస్థలు. ముఖ్యంగా రైతులకు పంట రుణాలు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందించి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. అయితే సిరికొండ మండలం గడ్కోల్…
కశ్మీర్లో ఎన్కౌంటర్:పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది
జమ్మూకశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా (LeT) ఉగ్రవాది ముహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘హాషిమ్ మూసా’ హతమయ్యాడని భారత సైన్యం బుధవారం ధ్రువీకరించింది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా గత కొన్నేళ్లుగా జరిగిన పలు ఉగ్ర దాడుల్లో ఇతనికి ప్రమేయం ఉందని, భద్రతా బలగాలు ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నాయని సైనిక అధికారులు వెల్లడించారు. ‘ఆపరేషన్ కొరాగ్’ ద్వారా సెర్చ్ ఆపరేషన్: బడ్గామ్ జిల్లా యూస్మార్గ్ పరిధిలో…
త్వరలోనే తీవ్ర ఆహార సంక్షోభం:జైశంకర్ హెచ్చరిక
రాబోయే నెలల్లో ప్రపంచం తీవ్రమైన ఆహార ధాన్యాల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ‘ఆసియా సొసైటీ’ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియా (ఇరాన్-గల్ఫ్) యుద్ధాల కారణంగా నల్లసముద్రం (Black Sea) మార్గంలో ప్రధాన ధాన్యాల ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ యుద్ధాల ప్రభావం గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న, పేద) దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర…
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మరింత ప్రయోజనం
లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన.. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి… నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్….
బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం
రుద్రూర్లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు…
ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు
ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు…
మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా యువత పోరాడాలి: రాహుల్ గాంధీ
దేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత, ముఖ్యంగా ‘జెన్ జెడ్’ (Gen Z) వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. నేరస్థులను రక్షిస్తూ బాధితులనే తప్పుపట్టే ప్రస్తుత సమాజ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడులు జరిగినప్పుడు మహిళల స్వేచ్ఛను హరించడం లేదా వారిని ఇళ్లకే పరిమితం చేయడం అత్యంత దారుణమైన చర్య అని, బాధితులకు శిక్ష విధించే ఈ పితృస్వామ్య మనస్తత్వాన్ని తుడిచిపెట్టాలని…
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్…
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…
