Amaravathi
‘చెప్పాం.. చేస్తున్నాం’.. స్థానిక ఎన్నికలకు చంద్రబాబు కొత్త నినాదం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయంపై కీలక దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించినట్లే స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి ప్రజల ఆశీర్వాదం లభించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను వరుసగా…
ఏపీ స్థానిక ఎన్నికలు.. నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు ఆదేశాలు!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల (అర్బన్ లోకల్ బాడీస్) ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువును పొడిగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వేసిన అభ్యర్థనపై గురువారంలోగా తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యల కారణంగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయినట్లు ప్రాథమికంగా బలమైన ఆధారాలు ఉన్నాయని జస్టిస్…
జగన్‌కు షాక్.. సొంత జిల్లాలో టీడీపీ ఖాతాలోకి 6 మున్సిపాలిటీలు!
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని కీలక మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ముఖ్యంగా రాయచోటిలోని మొత్తం 44 వార్డులను కూటమి పార్టీలు…
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు
ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్,…
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 20 (E6tv న్యూస్). శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు…
ఏపీలో మరో 4 రోజులు వర్షాలు: వాతావరణ శాఖ గుడ్ న్యూస్!
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం నుంచి తిరుపతి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలవారీగా వర్ష…
మున్సిపల్ స్థానాలకు నేటి నుంచే నామినేషన్లు!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలతో పాటు మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల పోరుకు వేదిక సిద్ధం కావడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00…
రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మలు అందజేసిన లోకేశ్
విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రపతికి శాలువాతో స్వాగతం పలికి సత్కరించారు. మన కళాకారుల వారసత్వానికి ఈ కానుకలు గర్వకారణమని పేర్కొన్న లోకేశ్, రాష్ట్రపతిని కలవడం ఎంతో గౌరవంగా ఉందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వర్ష సూచన: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడనున్న వాతావరణం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్…
ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ధర్మవరం, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో…
