Amaravathi
నామినేటెడ్ నేతలకు గుడ్‌న్యూస్: పదవీకాలం పెంపు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న ఛైర్మన్లు, డైరెక్టర్లు మరికొంత కాలం తమ పదవుల్లోనే కొనసాగనున్నారు. కీలక వివరాలు: ప్రభుత్వ నిర్ణయంపై వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఈ…
ఏపీకి సీఎం విజయ్: చంద్రబాబుతో భేటీ!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈరోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి కీలక అంతర్రాష్ట్ర జలవివాదాలు, ప్రాజెక్టుల పురోగతిపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి విజయ్ పర్యటన షెడ్యూల్: తమిళనాడు సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏపీ:కొలిక్కిరాని కూటమి సీట్ల పంచాయితీ!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాల కేటాయింపుపై పార్టీల మధ్య పీటముడి పడటంతో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత పి.వి.ఎన్. మాధవ్ మధ్య సుమారు రెండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ తుది నిర్ణయానికి రాలేకపోయారు. ముఖ్యంగా కీలకమైన…
జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు సకాలంలో బ్యాంకు రుణాల పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో సోమవారం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో…
ధర్మవరం నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో అధికారుల అప్రమత్తం.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ధర్మవరం, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించి, తాగునీటి…
17 నగరాల్లో 9 చోట్ల మహిళలదే హవా.. ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఏపీలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం అధికారికంగా జీవో నెం. 252 జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేటాయింపులతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్లయిన విశాఖపట్నం, గుంటూరు మేయర్ పీఠాలు మహిళలకు దక్కనుండగా.. విజయవాడ,…
ఏపీ మున్సిపల్ ఎన్నికలు…మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల సీట్లు ఎవరికి?
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్థానాలు ఎస్టీలకు, రాజమండ్రి-కర్నూలు స్థానాలు ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉండగా, నెల్లూరును జనరల్ కోటాలో చేర్చే ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలతో పాటు సుమారు 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం దక్కేలా…
జగన్‌కు ఈడీ షాక్..అక్రమాస్తుల కేసులపై పిటిషన్
హైదరాబాద్ (e6tv news): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ జరిపి, త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్లో అభ్యర్థించింది. దశాబ్ద కాలంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులకు సంబంధించి.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాకపోవడం వల్లే విచారణ…
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
మేయర్ ఎన్నికల్లో 35.29 శాతం రిజర్వేషన్లు – మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి అమరావతి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల శాతాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని…
పుట్టపర్తిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ పుట్టపర్తి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సచివాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…
