Breaking News

జగన్‌కు ఈడీ షాక్..అక్రమాస్తుల కేసులపై పిటిషన్

హైదరాబాద్ (e6tv news): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ జరిపి, త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో అభ్యర్థించింది. దశాబ్ద కాలంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులకు సంబంధించి.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాకపోవడం వల్లే విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా, విచారణకు జగన్‌తో పాటు ఇతర నిందితులంతా వ్యక్తిగతంగా హాజరయ్యేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *