Amaravathi
ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!
తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…
అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు
అమరావతి (e6tv news): వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా (అబ్జర్వర్) ఆయన్ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే…
నంద్యాల పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు.. వైరల్ వీడియోపై చర్చ
పోలీస్ స్టేషన్ ఆవరణలో బాణసంచా కాల్చినట్లు ప్రచారం.. పోలీసు అధికారితో కేక్ కటింగ్‌పై విమర్శలు నంద్యాల, అక్టోబర్10:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాణసంచా కాల్చినట్లు,…
మానవత్వం చాటుకున్న చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ
గర్భిణీలకు సొంత ఖర్చులతో పౌష్టికాహారం.. వైద్య సిబ్బందికి భోజన వసతి చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 09 (E6 NEWS: ప్రతినిధి). ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన పోలీసు విధులే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వం కూడా ఉంటుందని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ ఎస్. సత్యనారాయణ నిరూపిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్.ఎస్. గేట్ ప్రాథమిక ఆరోగ్య…
ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ…
కార్యకర్తలకు గుర్తింపు.. పార్టీ బలోపేతానికి అడుగులు!
పరిగి మండలంలో వైఎస్సార్సీపీ ఐడీ కార్డుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి పెనుకొండ / పరిగి, అక్టోబర్ 9 (E6 TV NEWS): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. బీచగానిపల్లి, శిగుపల్లి, పైడేటి, పి.నరసాపురం, శిరేకొలం,…
రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు
104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….
ఏపీ: బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్ రద్దు!
ఆంధ్రప్రదేశ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో బీసీ కోటాను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ షీల్ నాగులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి,…
పెట్టుబడులలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఏపీ!
ఆంధ్రప్రదేశ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ సదస్సుకు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. జూన్ 2024 నుండి…
నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?
కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…
