Breaking News

యువత భవిష్యత్‌కు పోలీస్ శాఖ చేయూత

పోలీస్ ఉద్యోగ లక్ష్యానికి 300 మంది యువతకు ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ నిర్మల్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి). పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, IAS సహకారంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆధ్వర్యంలో నిర్మల్ పోలీస్ బ్రీఫింగ్ హాల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 300…

Read Full News

ఆస్తులన్నీ కొడుకులకు రాసిచ్చి.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా (కె) గ్రామంలో కన్నపిల్లల నిర్లక్ష్యం తాళలేక వృద్ధ దంపతులు దారుణంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి (88), అంజమ్మ (85) దంపతులకు ముగ్గురు కుమారులు సిద్ధారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డిలు ఉన్నారు. నర్సారెడ్డికి ఉన్న 22 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఇల్లును ముగ్గురు కొడుకులకు పంచేశారు. అయితే ఆస్తి పంచిన తర్వాత కొడుకులు తల్లిదండ్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వారు…

Read Full News

హైడ్రా మరో మైలురాయి:నిజాం కాలపు బావి వెలుగులోకి..

హైదరాబాద్ పాతబస్తీలోని శివరాంపల్లి పరిధిలో ఉన్న 356 ఏళ్ల నాటి చారిత్రక ‘బుమ్-రుక్న్-ఉద్-దౌలా’ చెరువును ఇటీవలే పునరుద్ధరించిన ‘హైడ్రా’, ఇప్పుడు అదే చెరువు కింద ఉన్న 1.50 ఎకరాల విస్తీర్ణంలోని పురాతన ఊట బావికి ప్రాణం పోస్తోంది. మూడవ నిజాం సికందర్ జా పాలనలో (సుమారు 1770 లో) నిర్మితమైన ఈ బావి నీటిలో ఔషధ గుణాలు ఉండటంతో నిజాం పాలకులు సైతం ఈ నీటిని తాగేవారని, ఎడ్లబండ్లపై లండన్ వరకు కూడా తరలించినట్లు చారిత్రక కథనాలు…

Read Full News

పేదరిక నిర్మూలనే నా ధ్యేయం: బాపట్ల సభలో సీఎం

బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను సవరించి పేద ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. తాను కూడా ఇతర నాయకుల్లా కార్యాలయానికే పరిమితమై బటన్లు నొక్కవచ్చని, కానీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ప్రతినెల వారి మధ్యకు వస్తున్నానని తెలిపారు. తమ…

Read Full News

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా గుట్టు రట్టయింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.82 కోట్ల విలువైన 365.2 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా గంజాయిని తరలిస్తున్న బైక్, హ్యుందాయ్ కారు, లారీలను సీజ్ చేయడంతో పాటు, ఒడిశాకు చెందిన దివాకర్ మండల్, సుమన్ పాల్, రాజశేఖర్ మార్గి, బ్రిజన్ నాస అనే నలుగురు నిందితులను…

Read Full News

ఏపీ స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితికి తెరదించుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1065లను కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతం 50 దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల కోటాను 50 శాతానికి లోబడి సమీక్షించి, ఆరు…

Read Full News

ఫారం-6 మార్పు చేయాలని ECIలో ఎవరు ఆదేశించారు?: రాహుల్ ప్రశ్న

ఎన్నికల సంఘం (ECI) కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ ‘ఫామ్ 6’లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మార్పులు చట్టవిరుద్ధమని కేంద్ర ఎన్నికల కమిషనర్లే రికార్డు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ— “ఈ మార్పులు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశించారు? టీసీఎస్‌లో దీనిపై సంతకం చేసిన…

Read Full News

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ (FZ1073) విమానంలో గాల్లో ఉండగానే అనూహ్య భయానక సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియా మీదుగా 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ సడన్‌గా ప్రధాన పైలట్ (భారతీయ జాతీయుడు స్మిత్ మచ్చార్) పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం అపహరణకు గురైనట్లు సూచించే ‘7500’ ఎమర్జెన్సీ కోడ్…

Read Full News

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: మంత్రులు, అధికారులతో దానం వరుస భేటీలు

అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడం, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తమ పట్ల చులకనగా వ్యవహరించారని భావించిన పలువురు మంత్రులు, అధికారులు ఇప్పుడు ఆయన మారుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో తన కంటే జూనియర్లు అనే ఫీలింగ్‌తో మంత్రులను నిర్లక్ష్యం చేశారని, అధికారులతోనూ కఠినంగా వ్యవహరించేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉప ఎన్నిక ముంగిట నియోజకవర్గంలో…

Read Full News

అభివృద్ధికి కేంద్ర-రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ కాంప్లెక్స్ (ఐడీవోసి)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి విషయాల్లో కేంద్రంతో కలిసి పనిచేస్తామని, రాష్ట్ర సమస్యల…

Read Full News