Breaking News
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత
భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.) భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన…
గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు 165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా,…
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్.. తక్షణమే తొలగించాలని ఆదేశం!
హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తక్షణమే తొలగించాలని (Relieve) రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ (Chief Secretary)ను హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో మరొక అర్హత కలిగిన అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. కోర్టు దిక్కరణ (Contempt of Court) కేసులో రంగనాథ్ తెలిపిన క్షమాపణను తోసిపుచ్చిన న్యాయస్థానం…
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ / మధిర: సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ (Freebies) కావు.. అవి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను (Centralized Community Kitchen) సోమవారం ఆయన ప్రారంభించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించినట్లే.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం…
విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగించండి: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు డిమాండ్!
హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (N. Ramchander Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆ శాఖను ఏదైనా ఒక యువ నాయకుడికి అప్పగించాలని సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థ వ్యతిరేక, సమాజ వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. రామచందర్ రావు…
భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…
జై జవాన్ – జై కిసాన్ – జై యువా’.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త నినాదం!
హైదరాబాద్: దేశంలో యువత నాయకత్వ పటిమను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘జై జవాన్ – జై కిసాన్ – జై యువా’ అనే కొత్త నినాదాన్ని ప్రతిపాదించారు. చట్టసభల్లో Gen Z మరియు యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు….
కార్యకర్తలు ఇచ్చిన రక్తాన్ని బిఆర్‌ఎస్ ఎవరికి అమ్ముకుంది?: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
హైదరాబాద్: బిఆర్‌ఎస్ (BRS) పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరాలపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్యకర్తల నుంచి సేకరించిన రక్తాన్ని బిఆర్‌ఎస్ నాయకులు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్‌లకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ కార్యకర్తలతో రక్తం ఇప్పించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు లేదా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు రక్తం ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు &…
తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…
శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాదం
నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య – వర్షాకాలంలో జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: శివ ఠాకూర్. ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని లక్ష్మి కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన…

