Breaking News
ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్
సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు,…
భారత్‌కు తొలి గోల్డ్ సాధించిన బొమ్మదేవర ధీరజ్: అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు!
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మెక్సికోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో జపాన్‌కు చెందిన జున్యా నకనిషిపై థ్రిల్లింగ్ షూట్ ఆఫ్ ద్వారా విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష ఆర్చర్‌గా ధీరజ్ రికార్డు సృష్టించారు. ముఖ్య విశేషాలు:
ఢిల్లీ వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలు…
తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కేబినెట్ నుంచి తనను తొలగించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేదా వివరణ అడగకుండానే కేబినెట్ నుంచి తప్పించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. ప్రధాన అంశాలు:
మనుషుల మెదళ్లను దున్నాలి.. అప్పుడే సమాజంలో నిజమైన మార్పు
– సామాజిక రాజకీయ విశ్లేషకుడు వడ్డేపల్లి మల్లేశం. E6tv NEWS-ప్రత్యేక కథనం. సమాజంలో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, విద్య, వైద్యం, సాంకేతిక రంగాల అభివృద్ధి మాత్రమే కాదని.. మానవ వికాసం, మానవీయ విలువలు, ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే నిజమైన సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని సామాజిక రాజకీయ విశ్లేషకుడు వడ్డేపల్లి మల్లేశం పేర్కొన్నారు. “ఇప్పుడు పొలాల కంటే మిన్నగా మనుషుల మెదళ్లను దున్నాలి” అనే ఆలోచనను సమాజం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో…
భద్రాచలంలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ ఢీకొని మహిళ దుర్మరణం భద్రాచలం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని బ్రిడ్జి రోడ్డులో సినిమా హాల్ ఎదురుగా సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు మహిళ మృతదేహం నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బ్రిడ్జి రోడ్డుపై విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలను…
ప్లాస్టిక్ రహిత ఎర్గట్లకు ఐక్య విద్య అడుగు
చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల విరాళం ఎర్గట్ల, సెప్టెంబర్ 13; (E6tv NEWS: ప్రతినిధి) ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఎర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ ముందడుగు వేశారు. మన ఐక్య విద్య–ప్రహ్లాద బడి చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను విరాళంగా అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్గట్ల గ్రామాన్ని ప్లాస్టిక్…
మోర్తాడ్‌లో సెప్టెంబర్ 15న కాంగ్రెస్ బహిరంగ సభ
ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరుకానున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మోర్తాడ్:, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ఈ నెల 15వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మోర్తాడ్ సండే మార్కెట్ వద్ద జరగనున్న ఈ సభకు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్…
భీంగల్ ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం
15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు భీంగల్: భీంగల్ పట్టణంలోని ఐదో వార్డు బోయగల్లిలోని జండాగల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను ఐదో వార్డు కౌన్సిలర్ బోదిరే లావణ్య నరసయ్య ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి…
గురువులదే దేశ భవిష్యత్తుకు అసలైన పునాది
సమాజంలోని అన్ని రంగాల అభివృద్ధికి గురువులే ఆద్యులు తల్లిదండ్రులతో సమానమైన దైవిక స్థానం ఉపాధ్యాయులదే బడ్జెట్ పాఠశాలల్లో 80 శాతం మంది మహిళా సిబ్బందే నిజామాబాద్ జిల్లాలో 60 బడ్జెట్ పాఠశాలల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉత్తమ ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులు అభినందనీయం బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) సమాజ నిర్మాణంలో…
బాల్కొండలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలు
బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్‌తో పాటు మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సట్ల ప్రవీణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సట్ల ప్రవీణ్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్…
