Breaking News
అడవి సిరికి.. ఆన్లైన్ దారి!
ఆదివాసి ఉత్పత్తులకు డిజిటల్ రెక్కలు.. ఇంటికే గిరి ఉత్పత్తులు భద్రాచలం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) అడవిలో పండిన ఉత్పత్తులకు గిరిజనుల చేతుల మీదుగా విలువ జోడించి.. వాటిని దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ చేసేందుకు భద్రాచలంలోని భద్రగిరి మార్ట్ మరో ముందడుగు వేసింది. గిరిజనుల శ్రమకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే లక్ష్యంతో మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి, ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. అడవి ఉత్పత్తులకు ‘భద్రగిరి…
మోర్తాడ్‌లో పోషణ మాసం కార్యక్రమం
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన మోర్తాడ్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎస్సీ సంఘం భవనంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కార్యక్రమానికి హాజరై పోషకాహార స్టాళ్లను సందర్శించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి,…
మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు
పెనుకొండ, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర మంత్రి సవిత బుధవారం (సెప్టెంబర్ 16) పెనుకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి కార్యాలయం వెల్లడించిన పర్యటన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అనంతరం ఉదయం 11 గంటలకు రొద్దం మండలం గోనిమేకలపల్లి గ్రామంలో ఇటీవల మృతి…
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు లెక్క చెప్పాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). మోర్తాడ్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 100…
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్…
గిరిజన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్, సెప్టెంబర్ 15: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు హన్మంత్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి,…
చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరామర్శ
నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.
మూడు దశాబ్దాల మావోయిస్టు ప్రస్థానానికి ముగింపు
సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి పోలీసుల ఎదుట లొంగుబాటురూ.5 లక్షల రివార్డు.. రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట లొంగిపోయారు. 1992లో ప్రారంభమైన ఆమె మావోయిస్టు ప్రస్థానానికి నేడు ముగింపు పలికారు. ఆమె…
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్ అంకిత్
భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి – ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలియంగ్ ఇండియా పాఠశాల పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంపై ఆర్ఐ, ఎంపీడీవోకు చర్యలకు ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో మంగళవారం…
వినాయకుడిని దర్శించుకున్న గుండు రవికుమార్ కుటుంబ సభ్యులు
పాల్వంచ,సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).గాంధీనగర్ 44వ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ గుండు రవికుమార్ (రవన్న) తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కేసుపాక లక్ష్మి, కోయిల, పద్మ, దుర్గ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు శుభాకాంక్షలు…
