Breaking News

భద్రాచలంలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

భద్రాచలం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)

పట్టణంలోని బ్రిడ్జి రోడ్డులో సినిమా హాల్ ఎదురుగా సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాద తీవ్రతకు మహిళ మృతదేహం నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బ్రిడ్జి రోడ్డుపై విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *