చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, గ్లాసుల విరాళం
ఎర్గట్ల, సెప్టెంబర్ 13; (E6tv NEWS: ప్రతినిధి)
ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఎర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ ముందడుగు వేశారు. మన ఐక్య విద్య–ప్రహ్లాద బడి చిన్నారుల కోసం స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను విరాళంగా అందించారు.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్గట్ల గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సర్పంచ్ ఉపేందర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని ఐక్య విద్య బృందం అభినందించింది.చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఐక్య విద్య టీం కోరింది. పిల్లలకు అందించే విద్యా సంస్కారాలే సమాజానికి మనం అందించే ఉత్తమ బహుమతిగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించిన సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్‌కు ఐక్య విద్య టీం సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

