News
తడపాకల్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఇటీవల వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరి నర్సయ్య, లోలపు గంగు (W/o రాజేందర్), ద్యాగల సాయన్న, గుండ కృపాల్ (S/o సురేష్) తదితరులు చెక్కులు అందుకున్నారు. మొత్తం…
రాష్ట్రంలోనే ప్రత్యేకం ఇందూరు వినాయకుడి శోభాయాత్ర
దుబ్బ చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు అంగరంగ వైభవంగా రథయాత్ర ఇందూరు, సెప్టెంబర్ 25: (E6tv NEWS: శివ ఠాకూర్). రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఇందూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం వినాయకుడి రథయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో…
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ రాజశ్రీ
తానూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ సీడీపీఓ రాజశ్రీ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సమతుల్యమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై…
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి) చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సవిత విద్యార్థినులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఎం.జె.పి. బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, ఇతర సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్న తీరును స్వయంగా వీక్షించారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన మంత్రి.. వారి…
సేవా సంకల్ప అభియాన్‌లో పలు సేవా కార్యక్రమాలు
తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…
ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ గిఫ్ట్..
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి, తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అథ్లెట్లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యంలో నజరానాల వర్షం కురుస్తోంది. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని స్పష్టం చేస్తూ, పతకాలు విజేతలకు సీఎం కార్యాలయం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టుకు రజతం: ఆసియా క్రీడల 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే విభాగంలో భారత అథ్లెట్ల బృందం రజత…
డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇంధన పొదుపుపై డ్రైవర్లకు కీలక సూచనలు డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్, మద్యం పూర్తిగా నిషేధం నిజామాబాద్, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్‌తో పాటు ఇంధన పొదుపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం రీజియన్…
గాయపడిన గర్భిణి జింక.. కాపాడిన స్థానికులు!
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో మానవత్వం పరిమళించిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా అడవి నుంచి దారి తప్పి పొలాల మీదుగా గ్రామంలోని ఎస్సీ ఏరియాలోకి వచ్చిన ఒక చుక్కల జింకపై గ్రామ వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కంచిలో చిక్కుకున్న జింకకు ప్రథమ చికిత్స: సుమారు 10 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో భయంతో పరుగులు తీసిన చుక్కల జింక సమీపంలోని కంచి (కంపచెట్లు) లో చిక్కుకుపోయింది. తీవ్రంగా…
జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నాలు..
జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాపై చెన్నూరు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్లాంట్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, నిరంతరం సీఎస్ఆర్ (CSR) అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అక్కడ రాజకీయ ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో సీఎస్ఆర్ నిధుల తరలింపు – ఇప్పుడు నియోజకవర్గానికే ప్రాధాన్యం: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైపూర్ ప్లాంట్…
హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన ఊరేగింపులు!
భాగ్యనగరంలో ఒకేరోజు శుక్రవారం ప్రార్థనలతో పాటు గణేష్ నిమజ్జన శోభాయాత్రలు పోటీపడి రావడంతో హైదరాబాద్ పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. చారిత్రక చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు వద్ద మధ్యాహ్నం ప్రార్థనలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ముగియడంతో నగర పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చార్మినార్ పరిసరాల్లో భారీ భద్రత: గణేష్ విగ్రహాల ఊరేగింపు మరియు ముస్లిం సోదరుల ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు లేదా ఉద్రిక్తతలకు తావులేకుండా పాతబస్తీ ప్రాంతంలో…
