News
మోపాల్‌లో దుర్గామాత ఉత్సవ సమితి నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
మోపాల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మోపాల్ గ్రామంలో శనివారం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నూతన షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమిపూజ చేశారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు,…
మాజీ మంత్రి మల్లారెడ్డి–బీజేపీ నేతల భేటీపై ఊహాగానాలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ నేతలతో సమావేశమైనట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, ప్రత్యర్థి పార్టీ నేతలను కలవడంతో ఈ భేటీ సాధారణమైనదా లేదా భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న తరుణంలో కీలక…
విశాఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చికెన్ పట్టివేత
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడ్డాయి. ప్రముఖ కామత్ హోటల్‌లో దాదాపు 60 కిలోలు, పిస్తా హౌస్‌లో 30 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల…
మిర్జాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ.. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేదలు, మహిళల హక్కుల…
పోలీసుల తీరుపై…నిమజ్జనాలు నిలిపేసి బంద్‌కు పిలుపు:ఆదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వేళ పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బ్యాండ్ మేళాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అర్ధరాత్రి వేళ కళాకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు, ఉత్సవ నిర్వాహకులు నిమజ్జనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో పట్టణంలో ప్రధాన రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వందలాది గణపతి విగ్రహాలు, వాహనాలు నిలిచిపోయాయి. శాంతియుతంగా సాగుతున్న శోభాయాత్రపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అధికారులు…
తిరుగుబాటుకే పాఠం నేర్పిన చాకలి ఐలమ్మ: కేసీఆర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ నిరంకుశ రాచరిక పాలనకు, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తిన ధీరవనిత అని, ఆమె ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట పంథా నేటి తరానికి ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఐలమ్మ స్ఫూర్తి ఎంతగానో ఇమిడి ఉందని గుర్తుచేశారు. తన…
తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ 15 శాతం లోటు వర్షపాతంతో అధికారికంగా ముగిసింది. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు, ప్రజలు నిరాశ చెందారు. సీజన్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఏకంగా 34 శాతం వర్షపాతం లోటు నమోదై తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఊరటనిచ్చింది. గత నాలుగు రోజులుగా…
ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జన ర్యాలీ
భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, పోలీసు సిబ్బంది మద్నూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణపతి నిమజ్జన ర్యాలీని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ర్యాలీగా నిమజ్జనానికి తరలించారు. ర్యాలీలో మద్నూర్ పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొని భక్తులకు భద్రత కల్పించారు. ఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు…
గణేష్ నిమజ్జనంపై పోలీసుల పటిష్ట నిఘా
కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ క్షుణ్ణంగా…
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలపై శిక్షణ
భీంగల్, సెప్టెంబర్ 25; (E6tv NEWS: ప్రతినిధి) వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికల (VGPP), VBGRAMG పథకంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో భీంగల్, వేల్పూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా బాబానగర్ గ్రామానికి సంబంధించి సామాజిక పటము, వనరుల పటము రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో PRA పద్ధతిలో గ్రామంలో అవసరమైన పనులను ఎలా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించారు….
