Breaking News

అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా…నలుగురు అరెస్ట్!

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) ఎస్సై డి. సాగర్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో పెద్ద బండ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. హీరాపూర్ వైపు నుంచి ఆదిలాబాద్ మార్గంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ (MH 40 BG 0948)ని పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణా ఘటనలో లారీ…

Read Full News

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ…

తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ముగియడం మరియు ఎస్ఎస్డీ (SSD) టోకెన్ల జారీ సాఫీగా సాగుతుండటంతో తిరుమలలో భక్తుల పెరుగుతోంది. శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. శుక్రవారం వివరాలు: క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, అల్పాహారం…

Read Full News

రైతులను వదిలేసి పశువులకు బీమానా? కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా అందించిన ‘రైతు బీమా’ పథకం ప్రీమియం చెల్లింపులను నిలిపివేసి, శనివారం కరీంనగర్‌లో కొత్తగా పశువుల బీమాను ప్రారంభించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రైతు బీమా రద్దు.. పశువుల బీమా ముద్దు” అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, తుగ్లక్…

Read Full News

ఢిల్లీ సుఖ్‌దేవ్ విహార్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక కారు తీవ్ర బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు అక్కడే ఉన్న రిక్షాతో పాటు ఆటోరిక్షాను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు….

Read Full News

ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.. ఆలయంలో ప్రత్యేక పూజలు

భీంగల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి) మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణంలోని చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో…

Read Full News

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కోరిక తీర్చిన మంత్రి సీతక్క!

హన్మకొండ రెడ్డి కాలనీకి చెందిన రిషిత అనే చిన్నారి డ్యూచెన్ ముస్కులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన, ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో పాటు కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. తనతో సెల్ఫీ దిగాలన్న బాలిక ఆకాంక్ష సోషల్ మీడియా ద్వారా తెలియడంతో పంచాయతీ రాజ్, సీతక్క (ధనసరి అనసూయ) నేరుగా రిషిత ఇంటికి వెళ్లి పరామర్శించి, ఫోటో దిగి ఆమె కోరికను తీర్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క భరోసానిచ్చారు….

Read Full News

గణేష్ నిమజ్జనాలు: నేడు కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగింపు

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం (సెప్టెంబర్ 26) కూడా కొనసాగుతుండటంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీవీ స్టాచ్యూ మరియు ఇందిరాగాంధీ రోటరీ ప్రాంతాల్లో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగుతున్నాయని హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు…

Read Full News

తుని రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురు యువకుల అరెస్ట్

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఐబీ అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో హౌరా–చెన్నై మెయిల్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల వద్ద చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని మనోజ్ ప్రధాన్ (27), శంభునాథ్ జనా (29), అజయ్ జనా (25)గా గుర్తించారు. నిందితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర మూడు ప్యాకెట్ల…

Read Full News

మళ్లీ పరుగులు తీస్తున్న గోదావరి: కాళేశ్వరం ఎత్తిపోతలతో జలకళ!

తెలంగాణ సాగునీటి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రక్రియను అధికారులు మళ్లీ ప్రారంభించారు. గోదావరి నదిలో నీటి ప్రవాహాలు పెరగడంతో లభ్యతగా ఉన్న జలాలను సద్వినియోగం చేసుకునేందుకు అన్నపూర్ణ, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లలో మోటార్లను ఆన్ చేశారు. అన్నపూర్ణ పంప్‌హౌస్ ద్వారా దాదాపు 6,400 క్యూసెక్కులను అనంతగిరి రిజర్వాయర్‌లోకి, రంగనాయక సాగర్ పంప్‌హౌస్ ద్వారా 6,600 క్యూసెక్కులను రంగనాయక సాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఈ నీటి నిల్వలు పెరగడం వల్ల ఆయకట్టు…

Read Full News

తెలంగాణ భూ రికార్డుల సమస్యలు:సామాన్యుడి భూ సమస్యలకు పరిష్కారం దొరికేనా?

తెలంగాణలో భూముల వ్యవహారం, రికార్డుల గందరగోళం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిషేధిత భూముల జాబితా (22A), అసైన్డ్, అటవీ, ఇనాం, చెరువులు మరియు ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో భూముల కేటాయింపులు, రికార్డుల మార్పుల్లో జరిగిన అక్రమాలు, పరిపాలనా లోపాలను తేల్చేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శ్రీదేవసేన నాయకత్వంలో ప్రభుత్వం జీవో 134 (GO 134) ద్వారా ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు…

Read Full News