Breaking News

భూములు అమ్మైనా బకాయిలు చెల్లిస్తాం:మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా కల్పించారు. వారి పెండింగ్ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ చెల్లింపుల కోసం అవసరమైతే ఆర్టీసీ భూములను అమ్మి అయినా బకాయిలు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన యునైటెడ్ ఫ్రంట్ నేతలతో సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విజేతలను అభినందించిన అనంతరం ఆయన…

Read Full News

మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తాగునీరు, ఇతర…

Read Full News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

దసరా నేపథ్యంలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ కోరుట్ల, అక్టోబర్ 17 (E6tv న్యూస్). దసరా పండుగ నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ.. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు….

Read Full News

బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా రామావత్ దేవిసింగ్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీటీసీ రామావత్ దేవిసింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.రామావత్ దేవిసింగ్ గతంలో సర్పంచ్‌గా రెండు పర్యాయాలు, ఎంపీటీసీగా, సొసైటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేస్తూ ప్రజలకు సేవలందించారు. గ్రామస్థాయి నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించారు. ఈ సందర్భంగా దేవిసింగ్ మాట్లాడుతూ, పార్టీ తనకు…

Read Full News

‘తిరంగా’ మార్చ్:సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే అరెస్ట్!

ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగ’ (తిరంగా మార్చ్) నిరసన ప్రదర్శనకు ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీ కరొల్ బాఘ్‌లోని ఎన్‌సీపీ (శరద్ పవార్) అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసంలో ఉన్న దిప్కేను పోలీసులు ముందస్తుగా డిటైన్ చేసి తీసుకెళ్లారు. ఆందోళనల నేపథ్యం: ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్…

Read Full News

తెలంగాణకు ‘హ్యుందాయ్’ కార్ల ప్లాంట్: సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం!

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, దీనిని పరిశీలించాలని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్’ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్ యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు….

Read Full News

పట్టభద్రుల ఎన్నికల్లో ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్‘ ప్రచార రథాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.

Read Full News

30 ఏళ్ల వివాదానికి ముగింపు: కేజేఆర్ గార్డెన్ కూల్చివేత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కేజేఆర్ గార్డెన్ (KJR Garden) ఫంక్షన్ హాల్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు శుక్రవారం జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించి, వాణిజ్య రీత్యా ఫంక్షన్ హాల్‌గా నిర్వహిస్తున్న ఈ కట్టడంపై కోర్టు తీర్పు మేరకు అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయింది.

Read Full News

త్వరలోనే భారత్-అమెరికా ట్రేడ్ డీల్: నిర్మలా సీతారామన్

భారత్, అమెరికా మధ్య ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంక్ (IMF-World Bank) వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ఆమె, అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు.

Read Full News

పిల్లల సోషల్ మీడియా భద్రతపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక, ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి వారిని రక్షించేందుకు పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ‘ది ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్’ మరియు దాని డైరెక్టర్…

Read Full News