News
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి).యువత మత్తు పానీయాలు, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.యువతలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఆందోళన కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 21-08-2026 శుక్రవారం విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని…
బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష
బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం
నిజాంసాగర్, ఆగస్టు 20:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ప్రస్తుత నీటి పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితి, సాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుత నీటి లభ్యత, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరాపై సమీక్షించినట్లు తెలిపారు.రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు…
మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
మద్నూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే…
పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్‌కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్…
అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI
భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…
రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ
కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?
దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన…
మాజీ మంత్రి రేఖానాయక్ రైస్ మిల్ పై నమోదైన కేసు
నిర్మల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు చెందిన రైస్ మిల్లు నుంచి ₹40.96 కోట్ల విలువైన ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్లు గుర్తించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) నిర్మల్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కేసు వివరాలు & ముఖ్యాంశాలు: మిల్లు వివరాలు:…
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు…

