News
ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం.. ఇందూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాకారం!
కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంపిక రూ.6 కోట్ల నిధులు మంజూరు.. కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ ఇందూరు, అక్టోబర్ 15: (E6tv NEWS: శివ ఠాకూర్) తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో నిజామాబాద్ నగరంలో మరో కీలక విద్యా ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ప్రతి సీటుపై వైసీపీ గురి!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏ ఒక్క స్థానాన్ని కూడా ఖాళీగా ఉంచకుండా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలో నిలపాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఎన్నికల విధివిధానాలపై దిశానిर्देशం చేశారు. నామినేషన్ల దాఖలు…
కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లే్వర స్వామి దేవస్థానంలో రాష్టపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆమెకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండపైకి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో శ్రీ మహా చండీ దేవి అలంకారంలో ఉన్న…
వర్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
రూ.10.70 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం వర్ని, అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.10 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని బుధవారం ఆయన…
జనసేనలో వంగవీటి రాధా.. విజయవాడ మేయర్ రేసులో బిగ్ ట్విస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరుణంలో ఆయన పార్టీ మారడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
విజయనగరం జడ్పీ రేసులో బొత్స కూతురు అనూష..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ విజయనగరం జిల్లా రాజకీయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె, భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అయిన డాక్టర్ బొత్స అనూషను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా బొత్స కుటుంబం…
మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో భారత్ అభివృద్ధి పథంలో పయనం
కేంద్ర పథకాలతో కోట్లాది మందికి లబ్ధి ‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 TV NEWS: శివ ఠాకూర్). ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రపంచంలో విశ్వగురువుగా నిలిచే దిశగా పయనిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఇందూరులోని…
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగాడా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పుణేఠా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వచ్చింది. తొలి విడతలో భాగంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100…
ఎన్‌సీసీ క్యాడెట్లలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలి
550 మంది క్యాడెట్లకు వార్షిక శిక్షణ శిబిరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్ అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్). యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. నిజామాబాద్‌లోని సీటీసీ (CTC)లో 12వ బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన ముఖ్య…
చైనాతో వ్యాపారంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
చైనాతో గతంలో కొన్ని విభేదాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను ‘మరోసారి’ మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ‘బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారత్-చైనా, భారత్-అమెరికా దౌత్య, వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
