Breaking News

జోనిట వివాహ విందుకు మారేపల్లి గ్రామ ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం

డోంగ్లీ, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి) డోంగ్లీ మండలం మారేపల్లి గ్రామ ప్రజలకు స్థానిక సర్పంచ్ గాయక్వాడ్ శ్రీధర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జోనిట వివాహ విందు కార్యక్రమం ఆగస్టు 16, 2026 ఆదివారం రోజున డీబీఎల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మారేపల్లి గ్రామ ప్రజలందరూ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సర్పంచ్ శ్రీధర్ కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో…

Read More

అవల్‌గావ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మద్నూర్, ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అవల్‌గావ్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాన్యబాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.గ్రామాభివృద్ధిలో భాగస్వాములైన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు,…

Read More

పాములను రక్షిస్తూ ప్రజల భయాన్ని దూరం చేస్తున్న స్నేక్ క్యాచర్‌కు అటవీ శాఖ సన్మానం

హుజురాబాద్, ఆగస్టు 15:(E6tv NEWS, ప్రతినిధి). పాములను పట్టుకుని వాటిని సురక్షితంగా అడవి ప్రాంతాల్లో వదులుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న హుజురాబాద్ పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్ను అటవీ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కరీంనగర్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ప్రశంసా పత్రం అందజేసి, శాలువాతో సత్కరించారు. పగలు, రాత్రి తేడా లేకుండా సేవలు హుజురాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో…

Read More

బాల్కొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బాల్కొండ ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్మరించుకున్నారు. వారి త్యాగాలను దేశ…

Read More

ఎర్గట్ల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఎర్గట్ల, ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన శ్రీమతి జుంగాల గంగు, శ్రీమతి హుస్సేన్ బీకి వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎర్గట్ల తహసీల్దార్, డిప్యూటీ…

Read More

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శ్రీకాంత్

మలాపూర్ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డోంగ్లీ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మలాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత…

Read More

తోట వారి వివాహ విందుకు మేనూర్ గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం

కందర్పల్లి DBL గ్రౌండ్‌లో ఆగస్టు 16న వివాహ విందు మేనూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి మేనూర్ గ్రామ ప్రజలందరూ హాజరై వధూవరులను ఆశీర్వదించాలని పటేల్ గ్రామ సర్పంచ్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కందర్పల్లి–బిచ్కుంద రోడ్డులోని DBL గ్రౌండ్‌లో తోట వారి వివాహ…

Read More

వివాహ విందు వేడుకకు సాదర ఆహ్వానం

బిచ్కుంద, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). )జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివాహ విందు వేడుకకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరికీ సాదర ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కార్యకర్తలందరూ, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరూ ఈ ఆహ్వానాన్నే తమ ఆహ్వానంగా భావించి, పెద్ద మనసుతో శుభ కార్యక్రమానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు. వివాహ విందు వివరాలు:📅…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…

Read More

మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More