Breaking News

బీడీ కార్మికులపై అదనపు వసూళ్లు ఆపాలి

దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్,అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)బీడీ కార్మికుల నుంచి వేయి బీడీలకు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాయి బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజకీయ బీడీ వర్కర్స్ యూనియన్…

Read Full News

నైపుణ్యంతోనే మహిళా సాధికారత

యువతులు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి).యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ తమ సొంత కాళ్లపై నిలబడాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు….

Read Full News

మౌంట్ తరంగ్–II అధిరోహించిన విశాలావత్ బన్నీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో ఉన్న మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన సాంకేతిక శిఖరం మౌంట్ తరంగ్–IIను విజయవంతంగా అధిరోహించిన తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విశాలావత్ బన్నీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో కూడిన భారతీయ పర్వతారోహణ బృందం మియార్ లోయలో సవాలుతో కూడిన ఈ శిఖరారోహణను విజయవంతంగా…

Read Full News

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 114 కొత్త జెట్స్!

భారత వాయుసేన (IAF) యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత చారిత్రక అడుగు వేస్తోంది. సుమారు రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 బహుళ ప్రయోజన యుద్ధ విమానాల (MRFA) కొనుగోలుకు సంబంధించిన మెగా ఒప్పందాన్ని ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) చివరినాటికి ఖరారు చేసే అవకాశం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ వెల్లడించారు. ‘ఎయిర్ ఫోర్స్ డే’ పురస్కరించుకుని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Read Full News

భారత్-అమెరికా ట్రేడ్ వార్…ట్రేడ్ డీల్ లేటెస్ట్ ఎనాలసిస్!

భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) చుట్టూ ఉన్న ఆటంకాలు ఇంకా తొలిగిపోలేదు. రష్యాపై అమెరికా ఆంక్షల చట్టం, సెక్షన్ 301 కింద సుంకాల ప్రక్రియ, కొనుగోలు కట్టుబాట్లు మరియు ఆర్థిక సార్వభౌమాధికారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతుండటమే ఈ ఆలస్యానికి కారణమని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ స్పందిస్తూ.. చర్చలు చివరి దశకు చేరుకున్నప్పటికీ, ఈ చిక్కుముడులు విప్పే వరకు…

Read Full News

పెట్రోల్ లీటరుకు రూ.5, డీజిల్ రూ.3 పెంచేసిన నయారా ఎనర్జీ!

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల వ్యయాలు గణనీయంగా పెరగడంతో, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ ‘నయారా ఎనర్జీ’ (Nayara Energy) ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శనివారం (అక్టోబర్ 3, 2026) తెల్లవారుజాము నుంచే పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు తక్షణమే అమల్లోకి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి ఉన్న 7,108 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ నూతన ధరలు వర్తిస్తాయి. ధరల…

Read Full News

ఏపీకి వెదర్ అలర్ట్! వచ్చే 72 గంటల్లో వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మళ్లీ మారబోతోంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాగల మూడు రోజుల పాటు (నెక్స్ట్ 72 అవర్స్) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాంతాల వారీగా…

Read Full News

తెలంగాణలో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో అక్టోబరు నెలలో సాధారణానికి భిన్నంగా తీవ్ర ఎండలు, ఉక్కపోత వర్షపాతం లేకపోవడంతో జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.9 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) వెల్లడించింది. హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటాయి. బిహెచ్‌ఇఎల్ (BHEL),…

Read Full News

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పనులు షురూ..

వరంగల్ (మామనూరు) ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో మొదటి దశ ప్రక్రియ ఊపందుకుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కొత్తగా సేకరించిన భూమి చుట్టూ రక్షణ గోడ (ప్రీకాస్ట్ బౌండరీ వాల్) నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఖరారు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘సైదాక్స్ ఇంజనీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. టెండర్ మరియు నిర్మాణ వివరాలు: ఇప్పటికే భూసేకరణ పూర్తయిన దృష్ట్యా, త్వరలోనే టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ATC) టవర్ నిర్మాణాలకు…

Read Full News

బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలి

అక్టోబర్ 6న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలితెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న ముధోల్, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘ఛలో భైంసా’…

Read Full News