News
భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
పాలస్తీనా ప్రజల పోరాటానికి ప్రపంచ ప్రజలు మద్దతు ఇవ్వాలి: రంగారెడ్డి భగత్ సింగ్ 119వ జయంతి సదస్సులో వక్తలు కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను ఆదర్శంగా తీసుకుని ప్రజలు ముందుకు సాగాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు రంగారెడ్డి పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కార్యాలయంలో కామ్రేడ్ కిచ్చర్ల కల్పన అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ…
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్…
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌పై కేసు
భీంగల్, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి) అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను భీంగల్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జొరా బైపాస్ రోడ్డుపై ఇసుకతో అనుమానాస్పదంగా వెళ్తున్న జాన్ డీర్ ట్రాక్టర్‌ను పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ నంబర్ AP15BP1423గా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను విచారించగా భీంగల్…
అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు: మంత్రి సవిత
సోమందేపల్లి, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు వారి మానసిక, శారీరక అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాసేవలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేవా…
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్‌లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…
మోర్తాడ్ మండలంలో ఆత్మీయులను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మోర్తాడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధర్మోరా గ్రామంలో సాయన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉషన్న…
భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
భీమ్‌గల్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ పిలుపునిచ్చారు. భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన…
చిత్తూరులో మళ్లీ ఏనుగుల భయం..అధికారులను అప్రమత్తం చేసిన పవన్ కల్యాణ్
అడవుల్లో ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు, ప్రజల భద్రతపై సోమవారం ఆయన అటవీశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవాసాల్లోకి వచ్చే ఏనుగులు మనుషులపై దాడులు చేయకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ముఖ్యమైన ఆదేశాలు & ముఖ్యాంశాలు:
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం బహదూర్‌పల్లి రైతుల భూముల సేకరణపై కేటీఆర్ ప్రశ్నలు
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో బహదూర్ పల్లి రైతుల వ్యవసాయ భూములను అడ్డగోలుగా లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండగా, పేద రైతుల భూములను ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల నివాసాలు, భూములు కోల్పోతున్న బహదూర్ పల్లి రైతులతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు….
