Breaking News

గెలవాలి అన్న తపనే తనను ఇంతకాలం ముందుకు నడిపించింది:కోహ్లీ

వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 పరుగులు మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తన సుదీర్ఘ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో తన 55వ సెంచరీ సాధించి భారత్‌కు విజయాన్నందించిన అనంతరం BCCI.tv తో మాట్లాడిన ఆయన… రికార్డులు లేదా గణాంకాల కోసం తాను ఎప్పుడూ ఆడలేదని, కేవలం జట్టును కష్టసమయాల నుంచి గెలిపించాలనే పట్టుదలే ఇన్ని సంవత్సరాలు…

Read Full News

ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ: దానం నాగేందర్‌పై అనర్హత వేటు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్ సభ్యత్వం రద్దయినట్లు స్పష్టం చేసింది. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ…

Read Full News

తిరుమలలో భక్తుల రద్దీ: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

పెరటాసి మాసానికి తోడు వరుస సెలవులు రావడంతో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే ఈ రద్దు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అక్టోబర్ 1, 5 తేదీల బ్రేక్…

Read Full News

డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

తహసీల్దార్ తారాబాయి వైఖరి మార్చుకోవాలి: బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి వైఖరి సరిగా లేదని, కొంతమందికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తన వైఖరిని మార్చుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు….

Read Full News

అమెరికా వీసా షాక్: ఇంటర్వ్యూకి 18 నెలల వెయిటింగ్!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం చుక్కలు చూపిస్తోంది. అమెరికా గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) విడుదల చేసిన తాజా ఫెడరల్ ఆడిట్ నివేదిక ప్రకారం… భారత్‌లో విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజులు (దాదాపు ఏడాది) వేచి చూడాల్సి వస్తోంది. కరోనాకు ముందు కేవలం 42 రోజులుగా ఉన్న ఈ సమయం ఇప్పుడు ఎనిమిది రెట్లకు పైగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా 14.55 లక్షల…

Read Full News

ఫార్మాసిటీ భూములపై ఫైర్.. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద రైతుల ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ 2,500 ఎకరాల పట్టా భూములను నిషేధిత (22-ఏ) జాబితా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫార్మాసిటీ బాధితులు, రైతులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రధాన రహదారిపైకి వచ్చి నిరసన తెలపగా, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read Full News

నేపాల్‌లో వర్ష బీభత్సం.. 24 మంది మృతి

నేపాల్‌ను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 14 మంది గల్లంతయ్యారు. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడమే కాకుండా వేలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివాసాలపైకి ఒక్కసారిగా మట్టి, రాళ్లు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో…

Read Full News

ఫార్ములా-ఈ రేసు కేసు: KTR సహా నలుగురి పాస్‌పోర్టులు జప్తు!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలని హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి (RPO) కోర్టు అధికారికంగా లేఖ రాసింది. విచారణ కొనసాగుతున్న సమయంలో నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలన్న ఏసీబీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం…

Read Full News

రైతు రామ్‌సింగ్ సమస్యకు పరిష్కారం

బోధన్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ పట్టణంలోని రైతు డిపో వద్ద సెప్టెంబర్ 25న రైతు రామ్‌సింగ్, రైతు డిపో యజమాని జగన్నాథరావు మధ్య నెలకొన్న సమస్యపై నిర్వహించిన ధర్నాకు పరిష్కారం లభించిందని సీపీఎం నాయకులు తెలిపారు. సోమవారం ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం, బెల్లాల్ గ్రామ ప్రజలు, వామపక్ష పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు తెలిపారు.రైతు రామ్‌సింగ్, రైతు డిపో…

Read Full News

ఉచిత వైద్య శిబిరంలో జూనియర్ సివిల్ జడ్జి

భైంసా, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బైంసా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా జూనియర్ సివిల్ జడ్జి ఆర్.కే. వెంకటరమణ సుహాస్ హాజరై శిబిరాన్ని పరిశీలించారు. మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స, వైద్య సలహాలు అందించారు. ఈ…

Read Full News