Adilabad
సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్
సన్నిత్ యాదవ్‌ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ బాల్కొండ, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు సన్నిత్ యాదవ్‌ను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్న పరామర్శించారు. ఇటీవల సన్నిత్ యాదవ్ ప్రమాదవశాత్తు కన్నుకు గాయం కావడంతో విషయం తెలుసుకున్న సునీల్ బాల్కొండకు వచ్చి ఆయనను పరామర్శించారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలను సన్నిత్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్న సునీల్, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు….
కిసాన్ మోర్చా సైకిల్ యాత్రకు భీంగల్‌లో ఘన స్వాగతం
భీంగల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర సోమవారం భీంగల్‌కు చేరుకుంది. బడా భీంగల్ నుంచి భీంగల్‌కు చేరుకున్న యాత్రకు భీంగల్ వాగు సమీపంలోని ఆలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం బోదిరే గల్లీ, బడా భీంగల్ రోడ్డు, బస్టాండ్ మీదుగా పురానిపేట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగింది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం…
హిందూ ఆలయాలపై దాడులు అమానుషం
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: హిందూ సంఘాల నాయకులు రుద్రూర్, అక్టోబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి). హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడటం అమానుషమని హిందూ సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంపై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ అన్సారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడి దిష్టిబొమ్మను…
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో నుజ్జునుజ్జు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
భైంసా, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ షేక్ సుహేల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. షేక్ సుహేల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటోకు డీజిల్ పోయించేందుకు ఆర్డీవో చెక్‌పోస్ట్ సమీపంలోని…
నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం నియామకం
నిజామాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు. మున్నూరు కాపు సంఘం సమావేశంలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించి పలువురిని వివిధ బాధ్యతల్లో నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా సుగంధం మురళి, సుగంధం సతీష్, ఆది రేఖుల సాయిలు, సోమినేని రాజేందర్, ఇంతు సత్యజీత్, ఇంతు ప్రవీణ్ కుమార్, ముహూర్…
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్ కత్తి నరేందర్‌కు ఘన సన్మానం
నిర్మల్, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లాలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్‌ను మాదిగ ఎంప్లాయీస్ నిర్మల్ జిల్లా ప్రతినిధులు, కాలనీ మైనార్టీ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్తి నరేందర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కత్తి సురేష్, ఉప్పిరి రవి, చందుల చందు, సుభాన్‌తో పాటు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు…
తెలంగాణలో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో అక్టోబరు నెలలో సాధారణానికి భిన్నంగా తీవ్ర ఎండలు, ఉక్కపోత వర్షపాతం లేకపోవడంతో జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.9 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) వెల్లడించింది. హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటాయి. బిహెచ్ఇఎల్ (BHEL),…
బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ ఇవ్వాలి
అక్టోబర్ 6న ‘ఛలో భైంసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలితెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న ముధోల్, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులు, ప్యాకర్లు, షేకర్లు, టేకేదార్లకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చేయూత పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కార్యదర్శి కే. రాజన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘ఛలో భైంసా’…
ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7న భారీ నిరసన ర్యాలీ
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: కాట్పల్లి నగేష్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని అఖిలపక్షాల డిమాండ్ ఓటు హక్కు పరిరక్షణ కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు నిజామాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: శివ ఠాకూర్). ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి మిత్రపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్…
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య సదుపాయాలు
యశోద హాస్పిటల్స్‌లో సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీకి అవకాశం నిజామాబాద్: అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వైద్య సాంకేతికతతో సమగ్ర చికిత్స అందించేందుకు యశోద హాస్పిటల్స్‌లోని క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తోంది. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, క్యాన్సర్ రకం, వ్యాధి దశ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత చికిత్స ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వైద్యులు…
