Breaking News

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మద్నూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చౌక్ ఆవరణలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు. కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు…

Read More

విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు

TSNPDCL ఏఈ సంజీవ్ కుమార్‌కు ప్రశంసా పత్రం నిర్మల్ ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిపేష్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఇందులో భాగంగా TSNPDCLలో ఏఈగా…

Read More

భీంగల్ ఎంపీడీవోకు ప్రశంసా పత్రం

నిజామాబాద్ ఆగస్టు 15: ,(E6 tv NEWS ప్రతినిది). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌కు ఘనమైన గౌరవం లభించింది. బోధన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన సేవలను…

Read More

త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్ ఆగస్టు 15: E6tv NEWS (శివ ఠాకూర్). దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి) బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి ఈ సందర్భంగా…

Read More

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: శివ ఠాకూర్). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా…

Read More

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు,…

Read More

భీంగల్‌లో ఘనంగా వన మహోత్సవం

ఇంటింటికీ మొక్కల పంపిణీ భీంగల్ ఆగస్టు 14: (E6 tv NEWS:T. గంగాధర్). ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12వ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్…

Read More

గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్

నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్). స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్‌లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ…

Read More

దహిగూడ ఇకపై ‘రాజర్షి షా గూడ’.. కొలాం గిరిజనుల గుండెల్లో చోటు సంపాదించుకున్న అదిలాబాద్ కలెక్టర్!

అదిలాబాద్ జిల్లా పిప్పల్‌ధారి పంచాయతీ పరిధిలోని కొలాం గిరిజన పల్లె ‘దహిగూడ’ ప్రజల జీవితాల్లో కలెక్టర్ రాజర్షి షా తెచ్చిన వెలుగులు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. గిరిజనుల దశాబ్దాల కల అయిన సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతో గిరిజనులు తమ గ్రామం పేరును ‘దహిగూడ’ నుంచి ‘రాజర్షి షా గూడ’ గా మార్చుకుని తమ కృతజ్ఞత చాటుకున్నారు. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న కలెక్టర్: గతంలో…

Read More