Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో నుజ్జునుజ్జు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భైంసా, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ షేక్ సుహేల్ తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల వివరాల ప్రకారం.. షేక్ సుహేల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటోకు డీజిల్ పోయించేందుకు ఆర్డీవో చెక్‌పోస్ట్ సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వైపు వెళ్తుండగా, భైంసా వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టినట్లు తెలిపారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన సుహేల్‌ను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

సుహేల్ తండ్రి ఇప్పటికే మృతి చెందగా, తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సుహేల్ ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *