Adilabad
బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం ఎడపల్లి, అక్టోబర్ 3: (E6tv NEWS: ప్రతినిధి) బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం కింద వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫారసుల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని…
గాంధీజీకి జిల్లా ఎస్పీ ఘన నివాళులు
నిర్మల్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి, సహనం, ధర్మం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అహింసా మార్గంలో…
తెలంగాణలో మొక్కజొన్నకు విపరీతమైన డిమాండ్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న (మక్కలు) పంటకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో మక్కల సాగు విస్తీర్ణం 5.93 లక్షల ఎకరాలకు పరిమితమవ్వడం, దానికి తోడు పౌల్ట్రీ పరిశ్రమ, పశుదాణా మరియు ఇతర పారిశ్రామిక అవసరాలు అధికమవ్వడంతో వ్యాపారులు మక్కల కొనుగోలుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. జగిత్యాల వంటి జిల్లాల్లో వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల వద్దకే వచ్చి క్వింటాలుకు ₹2,450 నుండి ₹2,600 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గత వానాకాలం…
గుడుంబా విక్రేతకు ఏడాది జైలు శిక్ష.. అప్పీల్‌లోనూ అదే తీర్పు
నిజామాబాద్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి)గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన మహిళకు విధించిన ఏడాది జైలు శిక్షను నిజామాబాద్ అదనపు జిల్లా న్యాయస్థానం (ADJ) కూడా సమర్థించింది. దిగువ కోర్టు తీర్పుపై నిందితురాలు చేసిన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం, గతంలో విధించిన శిక్షనే కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది. ఆర్మూర్ పట్టణంలో గుడుంబా విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ పోలీసులు 2024 జనవరి 5న పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులను…
స్త్రీనిధి రుణ చెల్లింపుల్లో గందరగోళం.. రూ.1 లక్ష ఎక్కడికి?
రుణం చెల్లింపు పేరుతో రూ.1 లక్ష తీసుకున్నారంటూ మహిళ ఆరోపణ PhonePe లావాదేవీలు, రుణ కార్డు, చెల్లింపు రికార్డులతో విచారణకు డిమాండ్ రూ.3,615 అదనపు చెల్లింపుపైనా అనుమానాలు.. రూ.50 వేల వ్యక్తిగత రుణం తీసుకున్నారంటూ ఫిర్యాదు సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో FIR నమోదు.. సమగ్ర దర్యాప్తు కోరుతున్న బాధితురాలు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత అందించేందుకు అమలు చేస్తున్న స్త్రీనిధి రుణాల చెల్లింపుల వ్యవహారంలో గందరగోళం నెలకొన్నట్లు…
హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత
రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…
డి-46 కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి
ఆకుల గోపాల్‌ను తిరిగి కాలువ ఇన్స్పెక్టర్గా నియమించాలి నీటిపారుదల శాఖ అధికారికి రైతుల వినతి… ఎడపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ప్రధాన కాలువ నుంచి డి-46 ఉపకాలువకు సాగునీరు చేరుతుంది. ఈ కాలువ ఆయకట్టు కింద ఎడపల్లి, దుబ్బతండా, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు బోధన్ మండలంలోని పెంటకలాన్, పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ సకాలంలో సాగునీరు అందకపోవడంతో…
తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇవ్వాలి
కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.. ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై…
గడ్కోల్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏం జరుగుతోంది?
రైతులకు క్రాప్ లోన్లలో ఇబ్బందులు.. రుణం కోసం పలుమార్లు తిరుగుతున్న ఖాతాదారులు బంగారు రుణం చెల్లించినా నగలు తిరిగి ఇవ్వడం లేదన్న ఆరోపణలు బ్యాంకు సిబ్బంది తీరుపై ఖాతాదారుల ఆవేదన.. ఉన్నతాధికారులు స్పందించాలంటున్న గ్రామస్తులు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).బ్యాంకులు సామాన్య ప్రజలకు ఆర్థిక సేవలు అందించాల్సిన సంస్థలు. ముఖ్యంగా రైతులకు పంట రుణాలు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందించి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. అయితే సిరికొండ మండలం గడ్కోల్…
బాబాపూర్‌లో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్‌పై అవగాహన సమావేశం
గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది) భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ…..
