Adilabad
కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ద్వీప పర్యాటకానికి ప్రణాళికలు
నిర్మల్: తెలంగాణలో ‘ఐలాండ్ టూరిజం’ (ద్వీప పర్యాటకం) ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న ఒక ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) ప్రత్యేక దృష్టి సారించింది. సహ్యాద్రి కొండల మధ్య, ప్రసిద్ధ కుంతల జలపాతానికి దిగువన ఉన్న ఈ ద్వీపం పర్యాటకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకోనుంది. ప్రధాన ఆకర్షణలు & ప్రతిపాదనలు: గతంలో 2016లో ఇక్కడ బోటింగ్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, మత్స్యకారుల చేపల…
గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ
బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…
లింగంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
పెద్దకొడప్‌గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం…
మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు…
సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్
ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…
ఒక హత్య.. ఎన్నో ప్రశ్నలు
గురువుకు గోరీ కట్టిన గంజాయి మత్తు! స్పెషల్ స్టోరీ, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).చదువు చెప్పి జీవితానికి బాటలు వేయాల్సిన గురువే దారుణ హత్యకు గురికావడం.. ఆ హత్యకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడ్డారన్న దర్యాప్తు అంశాలు వెలుగులోకి రావడం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, చెడు…
బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష
బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…
మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
మద్నూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే…
పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్‌కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్…
అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI
భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…

