Adilabad
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి
భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల…
పెండ్‌పెల్లిలో రూ.2.36 కోట్లతో అభివృద్ధి పనులు
భైంసా, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). భైంసా మండలం పెండ్‌పెల్లి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, పూలు చల్లగా, డప్పు చప్పుళ్లతో నిర్వహించిన స్వాగత కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం,…
ముధోల్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు…
ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ
నిర్మల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో…
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ
నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్,…
సమస్య చెప్పాడు.. పరిష్కారం చూపించాడు!
డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పెద్ద కొడప్‌గల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను స్థానికులు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ…
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి సవిత
పెనుకొండ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం తిమ్మాపురం, వెంకటరెడ్డిపల్లిలో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు సుమారు 150 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాల పంపిణీ పెనుకొండ, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు పెనుకొండ…
అవకతవకలకు తావులేదు..
స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు
రూ.15 వేల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టివేత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా అదుపులోకి నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు అదే విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు…
హుడా కాలనీలో ఉచిత వైద్య శిబిరం
శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గణేష్ మండపం వద్ద ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు, స్థానికులు…
