Adilabad
ఉప్పొంగుతున్న పెన్‌గంగా, ప్రాణహిత: నిలిచిపోయిన తెలంగాణ–మహారాష్ట్ర రోడ్డు రవాణా!
ఆదిలాబాద్ / నిర్మల్: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. పెన్‌గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్ వంతెన పైనుంచి వరద నీరు పారుతోంది. దీనివల్ల తెలంగాణలోని జైనథ్‌కు, మహారాష్ట్రలోని దిగ్రాస్‌కు మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అయితే, జాతీయ రహదారి (NH-44) పై వాహనాల రాకపోకలకు ఎలాంటి విఘాతం కలగలేదు. వరద ఉధృతి నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని…
టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్‌ల నియామకాలు
ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని…
బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్‌లో క్షేమంగా లభ్యం
బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్‌పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ…
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్‌కు కేంద్రం సానుకూల స్పందన
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు….
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…
ఉత్తర తెలంగాణకు వరం ‘ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్’ కొత్త రైల్వే లైన్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మహేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు!
హైదరాబాద్ / న్యూఢిల్లీ: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కొత్తగా ప్రతిపాదించిన ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ ప్రాంత రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని శాసనసభలో బిజెపి ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో కలిసి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు….
ఆపదలో ఆపద్బాంధవుడిగా మాజీ ఉప సర్పంచ్ గడ్డం సుభాష్
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ…
SIR ప్రక్రియను జిల్లాలో 100 శాతం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను దాదాపు 100 శాతం పూర్తి చేసేలా బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నాగేష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని…
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు…
హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించిన ధర్మపురి సంజయ్
హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

