Khamam
తెలంగాణలో మంగళవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 76.8 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51 మిమీ, కందిలో 42.5 మిమీ, కడ్పాల్‌లో 41.3 మిమీ వర్షపాతం రికార్డైంది. రాబోయే…
తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…
తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…
ఖమ్మంలో భారీగా గంజాయి స్వాధీనం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, రూ.11.55 లక్షల విలువైన మత్తు పదార్థం సీజ్
కల్లూరు / ఖమ్మం: రాష్ట్రంలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివార్లలో భారీగా గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు ₹11.55 లక్షల విలువైన 23.10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఒడిశా టూ హైదరాబాద్.. అంతా పక్కా ప్లాన్! ఈ…
ఈ ఖరీఫ్‌లో ‘వరి’ వేస్తే నీళ్లివ్వలేం.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ / వరంగల్: రాష్ట్రంలో సాగునీటి కొరత రైతులకు తీరని ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వహించడంలో విఫలమైందని, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణమని వస్తున్న విమర్శలకు తోడు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు రైతాంగాన్ని మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో వరి పంటకు నీరందిస్తామని తాను గ్యారెంటీ ఇవ్వలేనని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రైతులు ఆతురతపడి వరి వేసి నష్టపోవద్దని,…
ఈశాన్య తెలంగాణలో నేడు విస్తృత వర్షాలు
నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS. రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,…
తెలంగాణకు ఎండల ఎఫెక్ట్…!
జూలై 15 వరకు పొడి వాతావరణం కొనసాగే సూచనలు 16-19 మధ్య అక్కడక్కడా తేలికపాటి ఉరుములు, జల్లులు మాత్రమే..! హైదరాబాద్, జూలై 12: E6 న్యూస్తెలంగాణలో జూలై రెండో వారం నుంచి వాతావరణం అసాధారణంగా వేడిగా మారింది. సాధారణంగా ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపించేలా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. నేడు నమోదయ్యే ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులపై అందుబాటులో ఉన్న…
నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*
*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….
కట్టుదిట్టమైన భద్రత మధ్య బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
దండు సంగ్రామ్, మాసుల లక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫీయా బేగం ఎన్నిక – ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి పారదర్శకత మధ్య జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం…

