Breaking News

సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం

మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా.. సేవిస్తే రూ.5 వేల జరిమానా ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6TV న్యూస్). మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు సోమిర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పెద్దలు,…

Read Full News

అపూర్వ సమ్మేళనం.. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు

25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.. గురువులకు ఘన సన్మానం బ్రాహ్మణపల్లి, అక్టోబర్ 11:(E6tv NEWS). వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటే మళ్లీ బాల్యంలోకి వెళ్లినట్లే ఉంటుంది. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి పనులు, చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. అలాంటి ఆత్మీయతకు అద్దం పట్టేలా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి…

Read Full News

కమ్యూనిస్టు నాయకుడు అంబటి విఠల్ గౌడ్ కుటుంబానికి MRPS నాయకుల పరామర్శ

కోటగిరి, అక్టోబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు అంబటి విఠల్ గౌడ్ తల్లి లచ్చవ్వ ఇటీవల మృతి చెందడంతో MRPS నాయకులు గురువారం కోటగిరి మండల కేంద్రంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా నాయకుడు సోంపూర్ పోచిరాం మాదిగ, మండల అధ్యక్షుడు కే. పోశెట్టి పండు మాదిగ, హస్కుల శ్రీకాంత్ మాదిగ, కన్నం నితిన్ గైక్వాడ్, గంగాధర్ తదితర…

Read Full News

ఓటర్ల జాబితా సవరణపై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉంది: మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 10 (E6TV న్యూస్): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ మౌనం వహించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తప్పిదాలు చేస్తోందని భావిస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు నిరసనలు చేపట్టడం లేదని నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఫార్ములా ఈ…

Read Full News

మన పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

బతుకమ్మ పండుగ మనదని గర్వంగా చెప్పుకోవాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హస్తినాపురం, హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన…

Read Full News

ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.2.20 లక్షల ఎల్‌ఓసీలు అందజేత

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) లెటర్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన అనికేష్ బాలయ్య వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ…

Read Full News

చలో నిర్మల్” భారీ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే…

Read Full News

నిజామాబాద్‌లో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు

110 విదేశీ, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం నిజామాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని న్యాల్‌కల్ రోడ్డు, ముబారక్‌నగర్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కంఠాల గంగారత్నం, ముడ భాస్కర్ ఇళ్లలో సోదాలు…

Read Full News

భద్రాచలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా…!

భద్రాద్రి కొత్తగూడెం (e6tv news): భద్రాచలం గోదావరి తీరం నుంచి అక్రమ ఇసుక రవాణా నిత్యకృత్యంగా మారింది. సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది అక్రమార్కులు అధికారుల ఆశీస్సులతో అర్ధరాత్రి వేళ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ట్రెంచ్‌లను ఇష్టానుసారంగా పూడ్చివేసి, రాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 5:30 గంటల వరకు సుమారు 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్‌ను రూ.5000 నుండి రూ.6000 వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు, ప్రజా…

Read Full News

ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం,నేతలు

తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. ఈ తొమ్మిది రోజుల పాటు సాగే రాష్ట్ర ప్రజల అత్యంత ప్రియమైన పూల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వివిధ…

Read Full News