Khamam
దళారుల నుంచి రైతులను కాపాడండి
సిండికేట్‌గా ఏర్పడి బయటి వ్యాపారులకు బెదిరింపులు.. గిట్టుబాటు ధరకు గండి రుద్రూరు, అక్టోబర్ 10 (E6 NEWS: ప్రతినిధి). పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంటే కొందరు దళారులు సిండికేట్‌గా ఏర్పడి అడ్డంకులు సృష్టిస్తున్నారని, బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను బెదిరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని రుద్రూరుకు చెందిన రైతు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ.. తాను…
మాసానిపల్లిలో చిరుత భయం.. ఆందోళనలో గ్రామస్తులు
రెండు మేకలపై దాడి చేసినట్లు స్థానికుల వెల్లడి గుట్ట సమీపంలో చిరుత పాదముద్రలు ఉన్నాయని సమాచారం అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి నాగిరెడ్డిపేట, అక్టోబర్ 09 (E6tv News). కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లి గ్రామ సమీపంలోని గుట్ట పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతుండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. వారం రోజుల క్రితం రెండు మేకలపై చిరుత దాడి…
పల్లెబోగుడా తండాలో ఉద్రిక్తత
అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజనులు.. మహిళ ఆత్మహత్యాయత్నం అటవీ భూమి వివాదంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు 14 ఎకరాల భూమి చదును చేసినట్లు ఆరోపణలు, ట్రాక్టర్ల స్వాధీనానికి అటవీ అధికారుల యత్నం పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం నాగిరెడ్డిపేట, అక్టోబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాక్టర్లను…
కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బహుజన నాయకుల సేవా కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv NEWS: ప్రతినిధి). బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బహుజనులు తమ ఓటు శక్తితో రాజ్యాధికారాన్ని సాధించి, పాలించే వర్గంగా ఎదగాలన్నది కాన్షీరామ్…
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు
ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv NEWS: ప్రతినిధి). ఎల్లారెడ్డి మండలంలోని కట్టకింది తండా (హజీపూర్) పరిధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.విద్యార్థులకు…
ఎస్ఐఆర్ను రద్దు చేయాలి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా…
భీంగల్ అభివృద్ధికి రూ.4 కోట్ల నిధుల కేటాయింపునకు కృషి
నూతన ఎమ్మార్వో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ముందడుగు కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల నాయకుల కృతజ్ఞతలు భీంగల్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవ, ఆదేశాలతో భీంగల్‌లో నూతన ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి రూ.1.75 కోట్ల నిధుల మంజూరు కోసం కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ…
మేనూర్ ఉన్నత పాఠశాలలో వైభవంగా బతుకమ్మ సంబురాలు
సాంప్రదాయ పండుగలు భావితరాలకు ప్రేరణ – సర్పంచ్ అశోక్ పటేల్ మేనూర్, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం మేనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ…
రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు
104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….
హంద్రీ-నీవా ఉపకాలువ సామర్థ్యం పెంపునకు భూమిపూజ
రూ.790.38 కోట్లతో పనులు ప్రారంభం పెనుకొండ, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి మడకశిర ఉపకాలువ సామర్థ్యం పెంపు పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.790.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా కాలువ నీటి సామర్థ్యాన్ని ప్రస్తుత 408 క్యూసెక్కుల నుంచి 642 క్యూసెక్కులకు పెంచనున్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి, మంత్రి సవిత,…
