Medchal
కరెంట్ కోతలు – నీటి ఎద్దడి: రైతులకు తప్పని పంట నష్టం భయం!
తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లముందే చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్ మండలం మిట్టపల్లిలో ఎండిపోతున్న పొలానికి ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుండగా, వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతలను తట్టుకోవడానికి డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు. డీజిల్ ఖర్చు తమకు అదనపు భారంగా మారుతోందని, పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు….
అమ్మమ్మ 100వ జన్మదినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv NEWS: శివ ఠాకూర్). గందె కళావతి అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ, ఒక శతాబ్దపు జీవిత ప్రయాణం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. వందేళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు మిళితమై ఉంటాయని అన్నారు.కుటుంబ సభ్యులకు అమ్మమ్మ అందించిన ప్రేమ, ఆప్యాయతలు, విలువలు, ఆశీర్వాదాలు…
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలి
ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించాలి – జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు రుద్రూర్, అక్టోబర్ 23 (E6tv NEWS). ముదిరాజులను ప్రస్తుత బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలని ముదిరాజు సంఘం జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మరింత ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తే ఆ వర్గమంతా ప్రభుత్వానికి అండగా ఉంటుందని…
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజా యోధుడు పండుగ సాయన్న
రుద్రూరులో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు రుద్రూర్, అక్టోబర్ 22 (E6tv NEWS). పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…
ఎల్లారెడ్డి యువకుడికి జాతీయ స్థాయి బాధ్యత!
ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి నియామకం ఎల్లారెడ్డి, అక్టోబర్ 23: (E6tv NEWS). ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన యువకుడు నాగరం రణదీప్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మిసన్పల్లికి చెందిన రణదీప్ రెడ్డి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం (AILSF) 2027–2028 నూతన కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాగరం నరసింహ రెడ్డి కుమారుడైన రణదీప్ రెడ్డి హైదరాబాద్‌లో బీఏ పూర్తి చేసి, ప్రస్తుతం…
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ‘అలయ్ బలయ్’
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 22 (E6tv NEWS). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ‘అలయ్ బలయ్’ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దసరా సమ్మేళనంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజకీయ…
సౌదీలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ వాసి మృతదేహం తరలింపునకు SATA చొరవ
భారత రాయబార కార్యాలయం నుంచి NOC ప్రక్రియ పూర్తి.. కార్గో ఏర్పాట్లు పెండింగ్ జెడ్డా, సౌదీ అరేబియా (E6tv NEWS): సౌదీ అరేబియాలో సహజ మరణం చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ మజ్రుల్ హక్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) చొరవ తీసుకుంది. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుతం కార్గో ఏర్పాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మహమ్మద్ మజ్రుల్ హక్ ఇస్సామ్ కబ్బానీ గ్రూప్‌లో ఉద్యోగిగా…
తెలంగాణలో 95% తగ్గిన వర్షపాతం!
ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సాధారణంగా కురవాల్సిన 75.6 మిమీ వర్షపాతానికి గాను కేవలం 3.5 మిమీ మాత్రమే వర్షం నమోదుకావడంతో ఏకంగా 95 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పంటల సంరక్షణ, నీటి నిల్వల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
వర్ని బస్టాండ్ వద్ద ఐదు వరకు బెల్ట్ షాపులు!
తెల్లవారుజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలా? బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనపు వసూళ్ల ఆరోపణలు మహిళా ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు.. ఇరిగేషన్ స్థలాల నిర్మాణాలపైనా ప్రశ్నలు వర్ని, అక్టోబర్ 22 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా వర్ని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణానికి ఆనుకొని సుమారు ఐదు వరకు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని,…
ఓపెన్ స్కూల్ పరీక్షల పేరుతో అదనపు వసూళ్ల ఆరోపణలు!
నిజామాబాద్ హరిచరణ్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంపై ఫిర్యాదులు పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థుల ఆందోళన ఫీజుల వసూళ్లు, ఖాళీ కాగితాలపై సంతకాలు, జవాబుల జిరాక్స్ ప్రతుల పంపిణీపై విచారణకు డిమాండ్ నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్: శివ ఠాకూర్). నిరుపేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వివాదాలకు కేంద్రంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంలో అదనపు డబ్బులు వసూలు చేశారని,…
