Breaking News

సుధాకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిబాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 6:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్‌ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్‌ మృతదేహాన్ని…

Read Full News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జనరల్ సెక్రటరీ బత్తుల గణేష్, రాష్ట్ర నిర్వాహకురాలు బుంగ చాందిని ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా జి. చింతపండు…

Read Full News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read Full News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌ నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత…

Read Full News

నిర్మల్‌లో ఇద్దరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ చేతుల మీదుగా చెక్కుల అందజేత.. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు నిర్మల్‌, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21వ వార్డు గాజులపేట్‌ కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ అందజేశారు.ఈ సందర్భంగా నూర్జా బేగంకు రూ.20,000, ఖలీల్‌ అహ్మద్‌కు రూ.14,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ తన చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

Read Full News

రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోదావరి పుష్కరాల పనులతో పాటు రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం నిర్మల్‌, అక్టోబర్‌ 05:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లాలో రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌…

Read Full News

భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనపై సీపీ వివరణ

పోలీసుల తప్పేమీ లేదు.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదు: పోలీస్‌ కమిషనర్‌ నిజామాబాద్‌, అక్టోబర్‌ 5:(E6tv NEWS: శివ ఠాకూర్). భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఘటనకు పోలీసు వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో…

Read Full News

మోకాలి శస్త్రచికిత్సకు రూ.1.10 లక్షల LOC మంజూరు

వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీతకు వైద్య చికిత్స కోసం LOC అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీత మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు. వనీత కుటుంబ…

Read Full News

కిసాన్ మోర్చా సైకిల్ యాత్రకు భీంగల్‌లో ఘన స్వాగతం

భీంగల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర సోమవారం భీంగల్‌కు చేరుకుంది. బడా భీంగల్ నుంచి భీంగల్‌కు చేరుకున్న యాత్రకు భీంగల్ వాగు సమీపంలోని ఆలయం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం బోదిరే గల్లీ, బడా భీంగల్ రోడ్డు, బస్టాండ్ మీదుగా పురానిపేట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగింది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం…

Read Full News

ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో నుజ్జునుజ్జు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భైంసా, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ షేక్ సుహేల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. షేక్ సుహేల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆటోకు డీజిల్ పోయించేందుకు ఆర్డీవో చెక్‌పోస్ట్ సమీపంలోని…

Read Full News