Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి

అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) 

తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్, జనరల్ సెక్రటరీ బత్తుల గణేష్, రాష్ట్ర నిర్వాహకురాలు బుంగ చాందిని ఆదేశాల మేరకు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.

నూతన కమిటీ ఎన్నిక

జిల్లా అధ్యక్షుడిగా జి. చింతపండు నరసయ్య, ఉపాధ్యక్షులుగా కే. నరసయ్య, గిరి ప్రసాద్, కోశాధికారిగా అంకం శ్రీనివాస్, సంయుక్త కోశాధికారిగా ఏ. రామచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏ. సతీష్, సంయుక్త కార్యదర్శిగా వి. గిరిప్రసాద్ ఎన్నికయ్యారు.

సంయుక్త ప్రచార కార్యదర్శులుగా ఎం.డి. రిజ్వాన్, బర్కుంట మహేందర్ను, సలహాదారులుగా ఎం. ప్రవీణ్, పి. దినేష్, కే. మహేష్ను ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.

సమస్యలను పరిష్కరించాలి

ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రతి జర్నలిస్టుకూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *