Nizambad
విద్యుత్, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శ ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). విద్యుత్, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితులు…
మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి తొలి అడుగు
ఆలయాన్ని సందర్శించి అంచనాల తయారీకి కొలతలు తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు బాల్కొండ, అక్టోబర్ 15: (E6 టీవీ న్యూస్). బాల్కొండ మండల కేంద్రంలో వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభను చాటుతున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేష్, స్థపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలోని విగ్రహాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, పునర్నిర్మాణ పనులకు…
బాధితురాలి వైద్య చికిత్సకు రూ. 2 లక్షల ఎల్‌ఓసీ అందజేత
జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచన వేల్పూర్, సెప్టెంబర్ 15: (E6 టీవీ న్యూస్). అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు ఎల్‌ఓసీ పత్రం కాపీని వేల్పూర్‌లో బాధితురాలి కుటుంబ…
అచ్చంపేట, మల్లూరు PACS చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ
రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిజాంసాగర్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట PACS చైర్మన్‌గా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మల్లూరు PACS చైర్మన్‌గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు….
పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండించాలి
అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలి: ఏఐకేఎంఎస్ బోధన్ డివిజన్ కార్యదర్శి సూర్య విఠల్ బోధన్, అక్టోబర్ 15: (E6 TV NEWS). పీడీఎస్‌యూ (PDSU) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ కార్యదర్శి సూర్య విఠల్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల…
స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
నిష్పాక్షికంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు శ్రీ సత్యసాయి జిల్లాలో 11.35 లక్షల మంది ఓటర్లు.. 467 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పుట్టపర్తి, అక్టోబర్ 15 (E6 TV NEWS). శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం పుట్టపర్తి…
జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఉట్‌పల్లి గిరిజన ఆణిముత్యం
తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనున్న జయ మనోజ్ఞ నాయక్.. గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు నిజామాబాద్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామానికి చెందిన గిరిజన యువ క్రికెటర్ జయ మనోజ్ఞ నాయక్ జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన రూడావత్ జయ పవన్ దంపతుల కుమార్తె అయిన మనోజ్ఞ నాయక్ తన ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామ ప్రజలు…
రాయసముద్రం చెరువు బతుకమ్మ ఘాట్‌లో బురద, చెత్తాచెదారం!
అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆవేదన.. రెండు రోజుల్లో శుభ్రం చేయకపోతే ధర్నా చేస్తాం: మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య రామచంద్రపురం, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి) రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ బురద, చెత్తాచెదారంతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ను పట్టించుకునే వారే కరువయ్యారని మహిళలు వాపోతున్నారు. ఇటీవల పోచమ్మ గుడిలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన కార్యక్రమం సందర్భంగా మహిళలు ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట…
మల్లికార్జున ఖర్గేను కలిసిన గుల్లాని సాయిలు
‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’, ‘ఓట్ చోరీ’ నిరసనల్లో పాల్గొన్నందుకు అభినందన ఎల్లారెడ్డి, అక్టోబర్ 14 (E6tv న్యూస్): ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే ఆశీస్సులు తీసుకున్నారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’, ‘ఓట్ చోరీ’ నిరసన కార్యక్రమాల్లో గుల్లాని సాయిలు చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మల్లికార్జున ఖర్గే…
వర్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
రూ.10.70 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం వర్ని, అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.10 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని బుధవారం ఆయన…
