Breaking News

మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో భారత్ అభివృద్ధి పథంలో పయనం

కేంద్ర పథకాలతో కోట్లాది మందికి లబ్ధి ‘చాయ్ మిలన్ @ మోదీ జీ 25’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 TV NEWS: శివ ఠాకూర్). ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రపంచంలో విశ్వగురువుగా నిలిచే దిశగా పయనిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఇందూరులోని…

Read Full News

ఎన్‌సీసీ క్యాడెట్లలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలి

550 మంది క్యాడెట్లకు వార్షిక శిక్షణ శిబిరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్ అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్). యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అన్నారు. నిజామాబాద్‌లోని సీటీసీ (CTC)లో 12వ బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన ముఖ్య…

Read Full News

తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుండటంతో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి…

Read Full News

పసుపు రైతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలను వివరించడంతో పాటు, పసుపు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా పసుపు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటికి తగిన…

Read Full News

నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ఫండ్ కేటాయించాలి

26వ డివిజన్‌లో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 న్యూస్: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్) కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 26వ డివిజన్‌లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు….

Read Full News

మూడు దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా దేవీ నవరాత్రి వేడుకలు

మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పటాన్‌చెరు, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి). పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్‌లో మహంకాళి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని…

Read Full News

నర్సాపూర్‌లో విద్యుత్ కోతలపై.. సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు!

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో వ్యవసాయ విద్యుత్ కోతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పంటలకు రోజుకు కేవలం ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నప్పటికీ, అది కూడా సక్రమంగా రాకపోవడంతో సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి నిర్ణీత సమయం…

Read Full News

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. సబ్‌స్టేషన్‌ ముట్టడి

ఏడు గంటల కరెంట్‌ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆందోళన కమ్మర్‌పల్లి, అక్టోబర్ 14 (E6 TV NEWS). వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోజుకు కేవలం ఏడు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అది కూడా నిర్దేశిత సమయానికి…

Read Full News

నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు

చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS). పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన…

Read Full News

మంచి అధికారులకు కష్టాలు తప్పవా?

రుద్రూర్‌లో వర్గపోరు.. నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పవా? ఒకే పార్టీలో రెండు వర్గాలు.. పాలనపై ప్రభావం చూపుతున్నాయా? రుద్రూర్, అక్టోబర్ 14 (E6 TV News: శివ ఠాకూర్). రుద్రూర్ మండల కేంద్రంలో అధికారుల బదిలీలు, స్థానిక రాజకీయ వర్గపోరు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే అధికారులకు రాజకీయ విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మండలంలోని ఓ శాఖలో పనిచేసిన…

Read Full News