Telangana
మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రగాఢ సంతాపం
మెట్పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్): మెట్పల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మెట్పల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో మెట్పల్లి పాత్రికేయ రంగంలో విషాదం నెలకొంది.సుదీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో సేవలందించిన జంగం విజయ్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహచర పాత్రికేయుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన…
రైతుల విద్యుత్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు!
₹10.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ జుక్కల్, అక్టోబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, వ్యవసాయ పనులకు విద్యుత్ అంతరాయాల వల్ల ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా జుక్కల్ నియోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణ్‌పల్లి–ఆరేపల్లి, కాటేపల్లి, లచ్చన్, తడ్గూర్ గ్రామాల్లో మొత్తం రూ.10.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు జుక్కల్…
తెలంగాణకు ‘హ్యుందాయ్’ కార్ల ప్లాంట్: సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం!
తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, దీనిని పరిశీలించాలని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్’ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్ యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు….
పట్టభద్రుల ఎన్నికల్లో ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్‘ ప్రచార రథాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
30 ఏళ్ల వివాదానికి ముగింపు: కేజేఆర్ గార్డెన్ కూల్చివేత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కేజేఆర్ గార్డెన్ (KJR Garden) ఫంక్షన్ హాల్‌ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు శుక్రవారం జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించి, వాణిజ్య రీత్యా ఫంక్షన్ హాల్‌గా నిర్వహిస్తున్న ఈ కట్టడంపై కోర్టు తీర్పు మేరకు అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయింది.
బతుకమ్మ వేడుకలపై జానపద గాయని సంధ్య
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. తొమ్మిదో రోజు పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జానపద గాయని సంధ్యతో పాటు స్థానిక మహిళలతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించబడింది. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ విశిష్టతను, పండుగ ప్రాముఖ్యతను మరియు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశేషాలను వారు పంచుకున్నారు. సాయంత్రం వేళ మహిళలంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను కనులవిందుగా అలంకరించారు. స్థానిక…
నీటి నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: కల్వకుంట్ల కవిత
ఎల్ నినో ప్రభావం, రాష్ట్రంలో రాబోయే తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వానికి కనీస దూరదృష్టి కొరవడిందని ఆరోపించారు.
దాండియా ఈవెంట్లో 22 మంది అదుపులోకి.. అసలేం జరిగింది?
హైదరాబాద్‌లోని బేగంపేట హాకీ గ్రౌండ్స్‌లో గురువారం రాత్రి జరిగిన దాండియా వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో ఇతర మతాలకు చెందిన సుమారు 22 మంది వ్యక్తులు పాల్గొన్నట్లు విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్దళ్ కార్యకర్తలు గుర్తించడం కలకలం రేపింది. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇదే సమయంలో చార్మినార్ జోన్ పరిధిలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) నిర్వహించారు. 3…
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా.. అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట పుట్టపర్తి, అక్టోబర్ 16 (E6tv NEWS). శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు…
శాలపల్లి వద్ద కారు బోల్తా: యువకుడు అక్కడికక్కడే మృతి
హుజూరాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్ మండలం శాలపల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన కారు, రోడ్డు పక్కన ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఆపై ఒక ఇంటి గోడను బలంగా గుద్ది బోల్తా పడింది. ప్రమాద స్థలాన్ని సీఐ కరుణాకర్, ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కారు అదుపు తప్పడానికి అతివేగమే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
