Breaking News

బతుకమ్మ వేడుకలపై జానపద గాయని సంధ్య

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. తొమ్మిదో రోజు పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జానపద గాయని సంధ్యతో పాటు స్థానిక మహిళలతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించబడింది. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ విశిష్టతను, పండుగ ప్రాముఖ్యతను మరియు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశేషాలను వారు పంచుకున్నారు.

సాయంత్రం వేళ మహిళలంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను కనులవిందుగా అలంకరించారు. స్థానిక చెరువులు, జలాశయాల వద్ద బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేస్తూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు మద్నూర్‌లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *