Breaking News

ఘనంగా లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలు

కంటి ఆసుపత్రి రోగులకు అన్నదానం రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్ లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.ఈ సందర్భంగా లయన్ పత్తి రాము మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం…

Read Full News

అణిచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కుంటాల:, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) అణిచివేతకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.కుంటాల మండల కేంద్రంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితం…

Read Full News

భైంసాలో శాంతియుతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం

జిల్లా ఎస్పీకి మున్సిపల్ కౌన్సిలర్ల కృతజ్ఞతలు భైంసా, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, శోభాయమానంగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భైంసా మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణతో పాటు ముందస్తు…

Read Full News

గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నిర్మల్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 25న నిర్మల్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని బాసర జోన్–2 డీఐజీ ఆర్. భాస్కరన్, IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన డీఐజీకి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్…

Read Full News

హుడా కాలనీలో ఘనంగా అన్న సమారాధన

శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 25(E6TV న్యూస్):శేర్లింగంపల్లి పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్న సమారాధన (అన్నదానం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో…

Read Full News

తప్పుడు కేసులతో వేధింపులు.. చర్యలు తీసుకోవాలని తాళ్ల రాంపూర్ గ్రామస్థుల విజ్ఞప్తి

తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).తాళ్ల రాంపూర్ గ్రామంలో కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు, ఫిర్యాదులతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. తమపై జరుగుతున్న వేధింపులను అరికట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాళ్ల రాంపూర్ పీఏసీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా జడ్జి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం అనంతరం గ్రామ కమిటీని రద్దు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అయితే గ్రామంలో ఏర్పడిన సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి…

Read Full News

సైబరాబాద్‌లో 1.03 లక్షల విగ్రహాలు నిమజ్జనాలు పూర్తి!

హైదరాబాద్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. గురువారం, శుక్రవారాల్లో మరిన్ని విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో, అధికారులు నిమజ్జన ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రికార్డు స్థాయిలో నిమజ్జనాలు: అధికారిక నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 23 నాటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 1,03,149 గణేశ్ విగ్రహాల నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. తుది విడత శోభాయాత్రలు, నిమజ్జనాలు కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింత…

Read Full News

క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం

క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై…

Read Full News

ఎర్రవల్లి సర్వేలో కొత్త ట్విస్ట్: అధికారుల నోటీసులను రిజెక్ట్ చేసిన రైతులు!

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి పరిధిలోని సర్వే నెంబర్ 325లో ఉన్న భూముల వివరాల పరిశీలన కోసం రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే గురువారం ఏడో రోజుకు చేరింది. ఏడీ సుదర్శన్, డీఐ సేవియా నాయక్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు భూముల కొలతలు చేపడుతూ, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అధికారుల నోటీసులను తిరస్కరించిన రైతులు: ఒకవైపు అధికారులు సర్వే ప్రక్రియ వేగవంతం చేస్తుండగా, మరోవైపు శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు…

Read Full News

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. : ఖమ్మం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బందోబస్తు విధులు ముగించుకుని తిరిగి వస్తున్న తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ వాహనాన్ని ఒక వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. పోలీస్ వాహనం నుజ్జునుజ్జు: మండలంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా వివిధ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. డ్యూటీ పూర్తయిన తర్వాత ఎస్‌ఐ కూచిపూడి జగదీష్, వాహన డ్రైవర్‌తో కలిసి పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు వాహనంలో తిరిగి…

Read Full News