Telangana
రూ.1.01 కోట్లకు దాటేసిన గణేశుడి లడ్డూ!
హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూ వేలం పాటలు మరోసారి రికార్డు ధరలతో హోరెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలానికి ముందే గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ ధరలు కోట్ల మార్క్‌ను దాటుతుండటం విశేషం. కీర్తి రిచ్మండ్లో రూ.1.01 కోట్లు: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ‘కీర్తి రిచ్మండ్’ గేటెడ్ కమ్యూనిటీలో మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో స్వామివారి లడ్డూ ఏకంగా రూ. 1,01,00,000 (రూ.1.01 కోట్లు) పలికింది. కమ్యూనిటీ నివాసితులు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడగా,…
గులాబీ కంచుకోటపై దండయాత్ర: 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించడమే కాకుండా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాజకీయ వ్యూహం: ప్రత్యామ్నాయ కంచుకోటలపై దృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో భాగంగా ప్రతిపక్ష అగ్రనేతల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిరేకల్ సభలో…
దానం నాగేందర్ అనర్హత కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ!
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అసలు వివాదం ఏంటంటే? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్…
గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాదం: గుర్తుతెలియని బైక్ ఢీకొని ఎస్ఐ మృతి
హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న ఎస్ఐ కిన్నెర వెంకన్న (55) బైక్ ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగిందంటే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న వెంకన్న, గణేష్ నిమజ్జన బందోబస్తు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-2 వద్ద ఆయన విధుల్లో ఉండగా, ఒక గుర్తుతెలియని…
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
ఇందూర్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంజూరైన రూ.1.25 కోట్లతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్వహణ…
భర్తే హత్య చేశాడంటూ ఆరోపణలు..
మృతురాలి బంధువుల రాస్తారోకో భైంసా, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి). భైంసాలో మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళనకు దిగారు. భైంసా ఏరియా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుబీర్ మండలంలోని బెల్గాం తండా-2 గ్రామానికి చెందిన లత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం బావిలో లభించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లతను ఆమె భర్త రోహిదాస్ హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి…
హిందూ–ముస్లిం భాయ్ భాయ్” నినాదాలతో మారుమోగిన భైంసా
ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భైంసా, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. శోభాయాత్ర సందర్భంగా “హిందూ–ముస్లిం భాయ్ భాయ్” నినాదాలు మారుమోగగా, ప్రజలు మతసామరస్యం, సోదరభావాన్ని చాటుకున్నారు. శోభాయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ భైంసా…
వర్ణి మండల MRPS నూతన కమిటీ ఎన్నిక
వర్ణి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి సోంపూర్ పోచిరాం ఆధ్వర్యంలో, జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి ఆదేశాల మేరకు వర్ణి మండల కేంద్రంలో MRPS మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా సంగోల్లా అశోక్, ఉపాధ్యక్షులుగా సమేనా కాశీరామ్, ప్రధాన కార్యదర్శిగా నెమ్లి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా చిట్టోళ్ల శ్రీనివాస్, ఫట్లా సాయిలు, కోశాధికారిగా ఈబత్వార్ మారుతీ, ప్రచార కార్యదర్శిగా సిందిగిడి రవిలను నియమించారు.సలహాదారులుగా కొరోల్లా సాయిలు, మెరుగు…
అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవ కార్యక్రమం
అనంతపురం,సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి) అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. వినికిడి, మాట్లాడే లోపాలతో ఉన్న దివ్యాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా…
జర్నలిస్ట్ బసవరాజుపై కేసులు ఎత్తివేయాలి
మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 23: (E6tv NEWS: ప్రతినిధి). జర్నలిస్ట్ బసవరాజుపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ…
