Breaking News

పాఠశాలలకు రూ.6 లక్షల విలువైన సామగ్రి విరాళం

ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ మెటీరియల్భీంగల్ కస్తూరిబా పాఠశాలకు 35 డ్యూయల్ డెస్క్ బెంచీలు వేల్పూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో, ఆయన వియ్యంకుడు, పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఈ సామగ్రిని ఆయా పాఠశాలల ప్రతినిధులకు అందించారు. ముచ్కూర్, ఎర్గట్ల,…

Read Full News

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి

మద్నూర్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సామాజిక సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు…

Read Full News

రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతల బైక్ ర్యాలీ

రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేతల బైక్ ర్యాలీ బోధన్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి). రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇందూర్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి సంఘీభావంగా బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో రుద్రూర్ నుంచి బోధన్ వరకు సుమారు 240 బైక్‌లతో భారీ ర్యాలీ చేపట్టారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్…

Read Full News

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం

నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిజామాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి). స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవలను, తెలంగాణ ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటాన్ని…

Read Full News

కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు

మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని ప్రజావాణిలో వినతి జిల్లా మార్పుపై నివేదిక కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ మద్నూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి విడదీసి నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ మద్నూర్ మండల ప్రజలు ప్రజావాణిలో వినతి సమర్పించారు. “కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు” అంటూ తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 24న మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…

Read Full News

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలా కార్యక్రమం నిర్వహిస్తాం ఈ ఏడాది 33 జిల్లాలతో పాటు విదేశాల్లో బతుకమ్మ సంబురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు…

Read Full News

గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసిన VDC సభ్యులపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్‌లో VDC దౌర్జన్యాలు మితిమీరాయి 39 మంది గౌడలు, 10 మంది దళితులను సాంఘిక బహిష్కరణ చేశారంటూ ఆరోపణ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ (VDC) పేరుతో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని గౌడ కులస్తులు ఆరోపించారు. తమ కులానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేసినట్లు పేర్కొంటూ, ఇందుకు బాధ్యులైన VDC సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం…

Read Full News

బాపూజీ సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే

తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు బీఆర్ఎస్ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం: వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాపూజీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

Read Full News

రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో అరెస్ట్

అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ మెట్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్‌పల్లి ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సీడీపీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల మెట్‌పల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో పద్మ తనిఖీ చేశారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్టును అనుకూలంగా నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్ల నుంచి…

Read Full News

చెన్నేకొత్తపల్లిలో “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్”

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం “సేవా సంకల్ప్ అభియాన్ – ఆంగన్ కా ఉత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం చీరలను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం ప్రభుత్వం అందించిన ప్లేట్లు,…

Read Full News